బోధనలో వెలుగు చూసిన బోగస్ ఓట్ల ఉదంతంపై రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్ రాజును కలిసిన భాజపా నాయకులు
బోధన్ లో వెలుగు చేసిన బోగస్ ఓట్ల ఉదంతంపై నిజామాబాద్ పార్లమెంట్ సభ్యులు శ్రీ అర్వింద్ ధర్మపురి గారు తెలంగాణ ప్రధాన ఎన్నికల అధికారి వికాస్ రాజ్ గారిని కలిసి ఫిర్యాదు చేయడంతో పాటు ఓటరు నమోదుపై రీ-వెరిఫికేషన్ జరపాలని కోరారు. అదేవిధంగా ఇప్పటికే నమోదైన ఓట్ల విషయంలో కూడా ప్రత్యేక అధికారిని నియమించి, పరిశీలన జరపాలని విన్నవించారు. అందుకు, సానుకూలంగా స్పందించిన సీఈవో వికాస్ రాజ్ గారు ప్రత్యేక అధికారిని డా” క్రిస్టినా జెడ్ చోంగ్థు IAS గారిని నియమించి, ఓటరు ప్రక్రియను పరిశీలిస్తామని తెలిపారు.
ఇట్టి బోగస్ ఓట్ల ఏరివేతకు కష్టపడ్డ ప్రతి ఒక్క భాజపా కార్యకర్తలకు, నాయకులకు అభినందనలు తెలియజేసి ఇదే స్ఫూర్తితో పనిచేయాలని తెలియజేసిన ఇందూర్ పార్లమెంట్ సభ్యులు ధర్మపురి అర్వింద్ గారు,
ఈ కార్యక్రమంలో ధర్మపురి అర్వింద్ గారితో పాటు ఎలక్షన్ ఎఫైర్స్ కమిటీ చైర్మన్ మర్రి శశిధర్ రెడ్డి గారు,మేడపాటి ప్రకాశ్ రెడ్డి, వడ్డీ మోహన్ రెడ్డి, సీనియర్ అడ్వొకేట్ ఆంటోని రెడ్డి గారు పాల్గొన్నారు.