NEP: కొత్త ఎడ్యుకేషన్‌ పాలసీలో 5+3+3+4 స్ట్రక్చర్‌ అంటే ఏంటి? ఫ్రేమ్‌వర్క్ గురించి పూర్తి వివరాలు..

NEP: నేషనల్‌ ఎడ్యుకేషన్‌ పాలసీ ద్వారా విద్యా విధానంలో విప్లవాత్మక మార్పులు చేశారు. ఈ కొత్త విద్యా విధానం కేవలం ట్రెడిషినల్‌ లెర్నింగ్‌పై మాత్రమే కాకుండా విద్యార్థులకు ప్రాక్టికల్‌ నాలెడ్జ్‌ అందించడంపై దృష్టి పెడుతుంది.

దేశాభివృద్ధిలో విద్య కీలకం. మెరుగైన మానవ వనరులు ఉంటే అన్ని రంగాల్లో అభివృద్ధి సాధ్యమవుతుంది. ఇతర దేశాలతో పోలిస్తే దేశంలో విద్యా విధానం వెనుకబడి ఉందని తరచూ ఆరోపణలు వినిపిస్తూనే ఉంటాయి. దీనికి ఉదాహరణగా ఏటా విదేశీ విద్య కోసం వెళ్లే విద్యార్థుల సంఖ్యను పేర్కొనవచ్చు. ఈ పరిస్థితులను చక్కదిద్దేందుకు కేంద్ర ప్రభుత్వం (Central Government) చర్యలు తీసుకుంటోంది. విద్యా విధానంలో కీలక మార్పులకు శ్రీకారం చుట్టింది. 2020లో రూపొందించిన నేషనల్‌ ఎడ్యుకేషన్‌ పాలసీ(NEP)ని అమల్లోకి తీసుకొచ్చింది.

నేషనల్‌ ఎడ్యుకేషన్‌ పాలసీ ద్వారా విద్యా విధానంలో విప్లవాత్మక మార్పులు చేశారు. ఈ కొత్త విద్యా విధానం కేవలం ట్రెడిషినల్‌ లెర్నింగ్‌పై మాత్రమే కాకుండా విద్యార్థులకు ప్రాక్టికల్‌ నాలెడ్జ్‌ అందించడంపై దృష్టి పెడుతుంది. అందుకే 5+3+3+4 స్ట్రక్చర్‌ను ఇంట్రడ్యూస్‌ చేసింది. ఇది ఫార్మల్‌ ఎడ్యుకేషన్‌ని రీడిఫైన్‌ చేస్తుంది, ఓవరాల్‌ లెర్నింగ్‌ ఎక్స్‌పీరియన్స్‌ని మెరుగురుపరుస్తుంది. నేషనల్ కరికులం ఫ్రేమ్‌వర్క్ (NCF) ప్రీ-డ్రాఫ్ట్ 5+3+3+4 స్ట్రక్చర్‌ని వివరించింది.

5+3+3+4 స్ట్రక్చర్‌ అంటే ఏంటి?

– మొదటి ఐదు సంవత్సరాలు (5)

మొదటి ఐదు సంవత్సరాలు నిర్మాణాత్మక సంవత్సరాలుగా పరిగణిస్తారు. ఇది పిల్లల అభివృద్ధిలో కీలకమైన దశ. ఈ ఐదు సంవత్సరాల కాలాన్ని రెండుగా విభజించారు.

3 సంవత్సరాల ప్రీస్కూల్:

పిల్లలు ప్రీస్కూల్‌లో మూడు సంవత్సరాలు గడుపుతారు. దీన్ని పిల్లల ఫ్యూచర్‌ లెర్నింగ్‌కి స్ట్రాంగ్‌ ఫౌండేషన్‌ అందించడానికి రూపొందించారు.

2 సంవత్సరాల ప్రైమరీ స్కూల్‌(లేదా మొదటి అంగన్‌వాడీ):

ప్రీస్కూల్ తర్వాత, పిల్లలు రెండు సంవత్సరాల పాటు ప్రైమరీ స్కూల్‌లోకి ప్రవేశిస్తారు. ఇది ఫార్మల్‌ ఎడ్యుకేషన్‌కు వారధిలా పని చేస్తుంది.

తదుపరి మూడు సంవత్సరాలు (3)

ఈ మూడు సంవత్సరాలు 1, 2వ తరగతులను కలిగి ఉంటాయి. ఇక్కడ విద్యార్థులు ఫార్మల్‌ ఎడ్యుకేషన్‌ జర్నీ ప్రారంభిస్తారు.

తదుపరి మూడు సంవత్సరాలు (3)

ఈ దశలో విద్యార్థులు 3 నుంచి 5 తరగతులకు వెళ్తారు. ఈ సంవత్సరాలను అడ్వాన్స్‌డ్‌ ఎడ్యుకేషన్‌కి ప్రిపరేషన్ ఇయర్స్‌గా పరిగణిస్తారు.

చివరి నాలుగు సంవత్సరాలు (4)

మొదటి తొమ్మిదేళ్ల విద్యను పూర్తి చేసిన తర్వాత, విద్యార్థులు 6 నుంచి 8 తరగతులను కవర్ చేస్తూ మిడిల్ స్కూల్‌లో ప్రవేశిస్తారు.

9- 12లో నచ్చిన గ్రూప్‌లు?

మిడిల్ స్కూల్‌ పూర్తి చేసిన తర్వాత, విద్యార్థులు నాలుగు సంవత్సరాల సెకండరీ విద్య (9 నుంచి 12వ తరగతి వరకు) కొనసాగించవచ్చు. ఈ సమయంలోనే విద్యార్థులు.. కొత్త విధానం ప్రకారం, సెకండరీ విద్యకు సంబంధించిన నాలుగు సంవత్సరాలలో నచ్చిన సబ్జెక్టులను చదువుకోవచ్చు. అందుబాటులో ఉన్న ఎనిమిది గ్రూప్‌లలో నచ్చిన దాన్ని సెలక్ట్‌ చేసుకోవచ్చు. లిస్టులో హ్యుమానిటీస్‌, మ్యాథమెటిక్స్‌- కంప్యూటింగ్‌, ఒకేషనల్ ఎడ్యుకేషన్‌, ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌, ఆర్ట్స్‌ ఎడ్యుకేషన్‌, సోషల్‌ సైన్స్‌, ఇంటర్ డిసిప్లినరీ సబ్జెక్ట్స్‌ వంటి గ్రూప్‌లు ఉన్నాయి.

సెకండరీ ఎడ్యుకేషన్‌లో దశలు

నాలుగు సంవత్సరాల సెకండరీ ఎడ్యుకేషన్‌ని రెండు దశలుగా విభజించారు. మొదటి దశలో విద్యార్థులు సైన్స్, సోషల్ సైన్స్, హ్యుమానిటీస్ వంటి విషయాలపై దృష్టి పెడతారు. రెండో దశలో హిస్టరీ, ఫిజిక్స్‌, లాంగ్వేజ్‌ వంటి అంశాలను చదువుతారు.

*11, 12వ తరగతులకు సెమిస్టర్ విధానం

లెర్నింగ్‌ని క్రమబద్ధీకరించడానికి, 11, 12వ తరగతుల విద్యార్థుల కోసం సెమిస్టర్ విధానం ప్రవేశపెడుతున్నారు. విద్యార్థులు సెమిస్టర్‌కు ఒక సబ్జెక్టును పూర్తి చేయాల్సి ఉంటుంది. విద్యార్థులు తమ 12వ తరగతి విద్యను పూర్తి చేయడానికి 16 పేపర్లను క్లియర్ చేయాల్సి ఉంటుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *