ప్రభుత్వ రోడ్లు భవనాల శాఖ ఉత్తరువు GO నెం 33, ప్రకారం GHMC, డబుల్ బెడ్ రూమ్ పథకంలో వికలాంగులకు 5% ఇళ్లు కేటాయింపు సరిగ్గా జరగడం లేదని వికలాంగుల సంఘాలు నాయకుల బృందం రాష్ట్ర కమీషనర్ శైలజ గారికి విజ్ఞప్తి చేశారు
రెండవ విడత పంపిణీ తేదీ Sept 21 నాటి పంపిణీలో వికలాంగులకు 5% ఇల్లు తప్పక చట్టపర హక్కుగా కేటాయించాలని సంఘాలు కమీషనర్ దృష్టికి తెచ్చారు. చాలా మంది సమాచారం తెలియక దరఖాస్తు చేసుకోలేదు, దరఖాస్తు చేసుకున్న వారు చాలా మంది వికలత్వం వివరాలు నోట్ చేయలేదని కావున ప్రత్యేకంగా దరఖాస్తు అవకాశం కూడా ఇప్పించాలని వివరించారు.
బృందం నాయకుల సమావేశంలో కమీషనర్ శైలజ మాట్లాడుతూ వెంటనే ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి అన్ని సమస్యలకు పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ సమావేశంలో వికలాంగుల నెట్ వర్క్ అధ్యక్షులు జవాబు చానల్ ఎడిటర్ శ్రీనివాసులు, FED అధ్యక్షులు కార్యదర్శులు గంగారాం, నాగభూషణం, సంఘాల నాయకులు,tvhss కిరణ్ గుత్తికొండ,మెరుగు శివ క్రిష్ణ, మున్నా, యాకయ్య, వెంకట స్వామి,