వరంగల్‌జిల్లా:సెప్టెంబర్ 12
బీఆర్‌ఎస్‌లోకి వలసల పర్వం కొనసాగుతూనే ఉంది. తాజాగా వరంగల్ జిల్లా పాలకుర్తి నియోజకవర్గం రాయపర్తి మండలం పెరకవేడు గ్రామానికి చెందిన పలువురు కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు బీఆర్‌ఎస్ పార్టీలో చేరారు.
పాలకుర్తి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో జరిగిన ఓ కార్యక్రమంలో వారికి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఆహ్వానించారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రానున్న ఎన్నికల్లో బీఆర్‌ఎస్ పార్టీ విజయానికి కలిసికట్టుగా పనిచేయాలని వారికి విజ్ఞప్తి చేశారు.
పార్టీలో చేరిన ప్రతి కార్యకర్తకు సరైన గౌరవం లభిస్తుందన్నారు. బీఆర్‌ఎస్ పార్టీలో చేరిన వారిలో పెరకవేడు గ్రామ కాంగ్రెస్ నాయకులలో గారే వెంకటేష్, గారే సుకుమార్, గారే వీరయ్య, గారే రామస్వామి, బిర్రు చంద్రయ్య, బిర్రు అంజి, గారే యాకయ్య, గారే సుమన్, గారే రాములు, గారే యాకూబ్, వేల్పుల శ్రీను, అయిత యాకయ్య, అయిత వీరస్వామి, నల్ల విష్ణు, గారే వీర స్వామి, వంగాల స్వామి, వంగాల సునీల్, గారే నారాయణ, ఆరూరి వెంకట సాయిలు, వేల్పుల యాక నారాయణ తదితరులు ఉన్నారు…