తాడేపల్లి
పేదల ఇల్లు తొలగిస్తే చూస్తూ ఊరుకునే ప్రసక్తి లేదు
మదర్ థెరిసాకాలనీ,అమరారెడ్డి కాలనీ పేద ప్రజలకు నోటీసులు ఇవ్వడం సరైంది కాదు
న్యాయం జరిగే వరకూ సిపిఐ అండగా ఉంటుంది
సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జంగాల అజయ్ కుమార్
మదర్ థెరిసా కాలనీ, అమరారెడ్డి నగర్ కాలనీలో గత 40 సంవత్సరాలుగా నివాసముంటున్న
పేద ప్రజలకు నోటీసులు ఇవ్వడం
సరైంది కాదని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జంగాల అజయ్ కుమార్ అన్నారు. మంగళగిరి తాడేపల్లి నగరపాలక సంస్థ పరిధిలోని తాడేపల్లి 5 వ వార్డు లోని మదర్ థెరిసా కాలనీ,
అమరారెడ్డి నగర్ ప్రాంతాల్లో సిపిఐ నేతల బృందం మంగళవారం పర్యటించింది.ఈ సందర్భంగా జంగాల అజయ్ కుమార్ ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు.జంగాల
అజయ్ కుమార్ మాట్లాడుతూ గత 40 సంవత్సరాలుగా నివాసం ఉంటున్న పేద ప్రజల ఇళ్లకు నోటీసులు ఇవ్వడం అన్యాయమని అన్నారు.పేద ప్రజలు కష్టపడి కట్టుకున్న ఇళ్లను తొలగించాలని ఇరిగేషన్ అధికారులు పేద ప్రజల ఇళ్లకు నోటీసులు ఇవ్వడం అన్యాయమన్నారు.కాలనీలో నివాసముంటున్న పేద ప్రజల వద్ద ఇంటి పన్నులు,కరెంటు బిల్లులు,వాటర్ బిల్లులు ఎందుకు కట్టించుకుంటున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు.ఇటీవల స్థానిక ఎమ్మెల్యే మదర్ థేరిసా కాలనీలో
రోడ్డు కూడా వేశారని ఇప్పుడు ఖాళీ చేయమనడం సరైనది కాదని అన్నారు.మదర్ తెరిసా కాలనీ, అమరారెడ్డి నగర్ కాలనీ వాసులకు
వారు నివాసం ఉన్న చోటనే నిలపట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు.తక్షణమే ప్రభుత్వం స్పందించి వారికి న్యాయం చేయాలని అన్నారు.న్యాయం జరిగే వరకు సిపిఐ పార్టీ అండగా ఉంటుందని అన్నారు.సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి చిన్ని తిరుపతయ్య,తాడేపల్లి మండల కార్యదర్శి ముసునూరు సుహాస్ మాట్లాడుతూ పేదల ఇళ్లను ఖాళీ చేయమనడం అన్యాయమని అన్నారు.వారికి న్యాయం జరిగే వరకు అండగా ఉంటామని అన్నారు.ఈ కార్యక్రమంలో
సిపిఐ మంగళగిరి మండల కార్యదర్శి జాలాది జాన్ బాబు,
తాడేపల్లి పట్టణ సహాయ కార్యదర్శి
తుడిమెల్ల వెంకటయ్య,మునగాల రామారావు,పంతగాని మరియదాసు,హనోక్, తదితరులు పాల్గొన్నారు.
ఖాళీ చేయిస్తే ఆత్మహత్యలే శరణ్యం :బాధితులు
గత 40 సంవత్సరాలుగా నివాసం ఉంటున్న తమను ఖాళీ చేయిస్తే ఆత్మహత్యలే శరణ్యమని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు.
తక్షణమే తమకు న్యాయం చేయాలని కోరారు