మాదాపూర్ డ్రగ్స్ కేసులో పోలీసుల దర్యాప్తు ముమ్మరంగా సాగుతోంది. ఈ కేసులో నిందితుడిగా ఉన్న హీరో నవదీప్ ఇంట్లో నార్కోటిక్ బ్యూరో మంగళవారం ఉదయం సోదాలు నిర్వహించింది. పోలీసులు సోదాలు చేసే సమయంలో నవదీప్ ఇంట్లో లేరని తెలుస్తోంది. తనను అరెస్టు చేయవద్దు అంటూ నవదీప్ ఇప్పటికే కోర్టు నుంచి ఆదేశాలు తెచ్చుకున్నారు. దీంతో ఈరోజు (మంగళవారం) వరకు నవదీప్‌ను అరెస్టు చేయొద్దంటూ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. డ్రగ్స్ కేసులో నవదీప్ మరోసారి హైకోర్ట్‌లో పిటిషన్ దాఖలు చేశారు. నవదీప్ పిటిషన్‌పై నార్కోటిక్ పోలీసులు కౌంటర్ దాఖలు చేయనున్నారు. పోలిసులు వెళ్ళిన సమయంలో నవదీప్ ఇంట్లో లేకుండాపోయారు. మాదాపూర్ డ్రగ్స్ కేసులో 37 నిందితుడిగా నవదీప్‌ను నార్కోటిక్ బ్యూరో చూపెడుతోంది. తన మిత్రుడు రామ్ చందు దగ్గర నుంచి డ్రగ్స్ తీసుకున్నట్లుగా పోలీసుల వద్ద ఆధారాలు ఉన్నాయి. ఇప్పటికే నవదీప్ స్నేహితుడు రామచంద్‌ను పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ని అరెస్ట్ చేసిన పోలీసులు.
