స్కిల్ డెవలప్మెంట్ కేసులో అక్రమంగా అరెస్టు కాబడిన తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు క్షేమంగా విడుదల కావాలని కోరుతూ నిడదవోలు నియోజకవర్గం . టీడీపీ సీనియర్ నాయకులు కుందుల సత్యనారాయణ గారి ఆధ్వర్యంలో రాజమహేంద్రవరం సెంట్రల్ జైల్లో ఉన్న నారా చంద్రబాబునాయుడుగారికి మీ వెంటే మేమున్నామంటూ ముద్రించిన పోస్ట్ కార్డులపై సంతకాలు సేకరించారు. ఎవరికి వారు స్వచ్ఛందంగా వచ్చి సంతకాలు చేయడం జరిగింది. ఈ సందర్భంగా కుందుల సత్యనారాయణ గారు మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు గారి అరెస్టుని ఖండించారు. చంద్రబాబుకు మద్దతుగా వివిధ వర్గాల ప్రజల నుంచి సంతకాలతో సేకరిస్తున్న పోస్ట్ కార్డులను కొరియర్ ద్వారా సెంటర్ జైల్లో ఉన్న చంద్రబాబు నాయుడుగారికి పంపిస్తామన్నారు.నియోజకవర్గం వ్యాప్తంగా ఒక్క ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా నిడదవోలు నియోజకవర్గం నుంచే సుమారు 5,000(ఐదువేలు) పోస్ట్ కార్డులను చంద్రబాబు గార్కి పంపిస్తామన్నారు.అలాగే రాష్ట్రపతి,గవర్నర్ లకు కూడా వారిని విడుదల చెయ్యాలని కోరుతూ ఉత్తరాలు రాస్తున్నమని అన్నారు. రాష్ట్ర ప్రజలకు ఆయన చేసిన
