తిరుపతి జిల్లా గూడూరులో నకిలీ రైల్వే డీఎస్పీని పోలీసులు అరెస్ట్ చేశారు…
ఒంగోలుకు చెందిన నాగరాజు అనే వ్యక్తి తాను రైల్వే డిఎస్పీ నని రైల్వే శాఖలో టిసి ,క్లార్క్ ఉద్యోగాలు ఇప్పిస్తానని దాదాపు 30 లక్షల వరకు వసూళ్లకు దరఖాస్తు చేసుకున్నాడు…
బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు…
అతని వద్ద నకిలీ ఐడి కార్డులు, పోలీస్ యూనిఫామ్, ల్యాప్ టాప్ ,విలువైన మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు…
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో డీఎస్పీ సూర్యనారాయణ రెడ్డి మాట్లాడుతూ నిందితుడు నాగరాజు పాత నేరస్తుడని..
ఈజీగా డబ్బు సంపాదించాలన్న ఆలోచనతో నకిలీ డీఎస్పీ అవతారం ఎత్తి ఉద్యోగాల పేరుతో పలువురిని మోసం చేశాడని అన్నారు..
అతని పై పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసిన రమేష్ అనే వ్యక్తిని కిడ్నాప్ చేసి 10 లక్షల రూపాయలు ఇవ్వకుంటే ఎన్కౌంటర్ చేస్తానని బెదిరించడంతో బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అసలు విషయం బయటపడిందని…
పోలీసులు కేసు నమోదు చేసుకుని క్షుణ్ణంగా విచారణ చేపట్టడంతో నకిలీ డీఎస్పీ బాగోతం బట్టబయలైంది…
నిరుద్యోగులు ఉద్యోగాల కోసం మాయ మాటలు నమ్మి మోసపోవద్దని సూచించారు…..