భూపాలపల్లి :జిల్లాలో మంగళవారం అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కాటారం మండలం మేడిపల్లి అటవీ ప్రాంతంలో ఎదురెదురుగా వచ్చిన రెండు కార్లు ఢీకొన్నట్లు తెలిసింది,
ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు*
మృతుడిని పెద్దపల్లి జిల్లా గోదావరిఖనికి చెందిన సింగరేణి రిటైర్డ్ కార్మికుడు బొంకూరి నర్సయ్యగా గుర్తించారు క్షతగాత్రులను చికిత్స నిమిత్తం వరంగల్ ఆస్పత్రికి తరలించారు. ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు