దిల్లీ : కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) గురువారం మాస్ లుక్కులో కనిపించారు. దిల్లీలోని ఆనంద్ విహార్ రైల్వే స్టేషన్ (Anand Vihar Railway Station)లో కొద్దిసేపు కూలీగా పనిచేశారు..
ఈ సందర్భంగా అక్కడి కూలీలతో ముచ్చటించి వారి సమస్యలను అడిగి తెలుసుకొన్నారు.
రాహుల్ తమను కలవాలని రైల్వే కూలీలు సామాజిక మాధ్యమంలో కోరిన వీడియో ఇటీవల వైరల్‌గా మారిన విషయం తెలిసిందే. దీనికి రాహుల్ స్పందించారు. గురువారం ఆయనే స్వయంగా ఆనంద్ విహార్ రైల్వే స్టేషన్‌కు వెళ్లారు. ఈ సందర్భంగా అక్కడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియోను కాంగ్రెస్ పార్టీ (Congress) తన అధికారిక ఎక్స్ (ట్విటర్) ఖాతాలో పంచుకొంది. భారత్ జోడో యాత్ర (Bharat Jodo Yatra)కు దీనిని కొనసాగింపుగా అభివర్ణించింది. ఆ వీడియోలో రాహుల్ గాంధీ రైల్వే కూలీ వలే సామాన్లు మోస్తున్న దృశ్యాలు కూడా ఉన్నాయి..