సాగునీటి రంగంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రపంచమే అబ్బురపడేలా అద్భుతాలు సృష్టించారని, అందుకు ఉదాహరణే కాళేశ్వరం ప్రాజెక్టు అని సినీ నిర్మాత, నటుడు, దర్శకుడు ఆర్ నారాయణమూర్తి అన్నారు.
బీఆర్‌ఎస్ రైతుల కష్టాలు తెలిసిన సర్కార్ అని కొనియాడారు. స్వయంగా తాను నిర్మించి, దర్శకత్వం వహించిన ‘యూనివర్సిటీ’ చిత్రం ప్రమోషన్‌లో భాగంగా శనివారం ఆయన ఖమ్మం నగరానికి వచ్చారు.
కాళేశ్వరం ప్రాజెక్టుతో ప్రపంచ దృష్టినే ఆకర్షించారు
ప్రముఖ సినీ దర్శక, నిర్మాతఆర్ నారాయణమూర్తి కితాబు
సాగునీటి రంగంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రపంచమే అబ్బురపడేలా అద్భుతాలు సృష్టించారని, అందుకు ఉదాహరణే కాళేశ్వరం ప్రాజెక్టు అని సినీ నిర్మాత, నటుడు, దర్శకుడు ఆర్ నారాయణమూర్తి అన్నారు. బీఆర్‌ఎస్ రైతుల కష్టాలు తెలిసిన సర్కార్ అని కొనియాడారు. స్వయంగా తాను నిర్మించి, దర్శకత్వం వహించిన ‘యూనివర్సిటీ’ చిత్రం ప్రమోషన్‌లో భాగంగా శనివారం ఆయన ఖమ్మం నగరానికి వచ్చారు. ఈ సందర్భంగా ఆయన ‘నమస్తే తెలంగాణ’తో ముచ్చటించారు. తెలంగాణ సముద్ర మట్టానికి ఎత్తయిన ప్రాంతంలో ఉంటుందని తెలిపారు. గతంలో ఇక్కడ సాగు నీటి వసతులు లేకపోవడంతో ప్రజలు వలస పోయేవారని అన్నారు.
తెలంగాణ సిద్ధించిన తర్వాత కేసీఆర్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి సాగునీటి రంగాన్ని గాడిలో పెట్టారని కొనియాడారు. అనేక ప్రాజెక్టులు నిర్మించారని, ఫలితంగా నేడు తెలంగాణలో బంగారు పంటలు పండుతున్నాయని తెలిపారు. తెలంగాణ రైతాంగాన్ని ఆదుకున్న గొప్ప విజన్ ఉన్న నాయకుడు కేసీఆర్ అని ప్రశంసించారు. ప్రపంచంలో ఇలాంటి ఎత్తిపోతల ప్రాజెక్టు కెనడాలో ఉండేదని, కానీ ఇప్పుడు ఆ స్థానం కాళేశ్వరం ప్రాజెక్టుకు దక్కిందని అన్నారు. కేంద్ర ప్రభుత్వ సహకారం లేకుండానే ఒక రాష్ట్ర ప్రభుత్వం ప్రపంచ స్థాయి ప్రాజెక్టును కేవలం నాలుగేండ్లలో నిర్మించిందని కొనియాడారు. రాష్ట్రం ఇప్పుడు దేశానికే అన్నం పెట్టే స్థాయికి ఎదిగిందని తెలిపారు. మంచి పాలన అందిస్తున్న సీఎం కేసీఆర్‌కు యావత్ తెలంగాణ రైతులు, ప్రజలు రుణపడి ఉంటారని అన్నారు.