పెద్దపెల్లి జిల్లా: మంథని మున్సిపల్ పరిధిలోని పుట్ట లింగమ్మ చారిటబుల్ ట్రస్టు ఆధ్వర్యంలో అంబేద్కర్ చెరువులో రాజ్యాంగ నిర్మాత బీఆర్ అంబేద్కర్, గౌతమ బుద్దుడు, శాసన సభ్యులు స్వర్గీయ గడిపెల్లి రాములు విగ్రహాలను మున్సిపల్ చైర్ ఫర్సన్ పుట్ట శైలజతో కలిసి ఆయన ఆదివారం సాయంత్రం ఆవిష్కరించారు.
ఈసందర్బంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ నియోజకవర్గంలో మహనీయుల చరిత్ర గురించి చర్చించబడలేదని, మన గురించి ఆలోచన చేయలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
ఒక నియోజకవర్గానికి ఇద్దరు ఎమ్మెల్యేలు ఉంటారనే విషయం తెలియకపోవడం బాధాకరమన్నారు. జి రాములు గురించి ఇంకా ఈ ప్రాంత ప్రజలకు తెలియని పరిస్థితులు ఉన్నాయని ఆయన వాపోయారు. గడిపెల్లిరాములు హుజురాబాద్ నందిమేడారం నుంచి శాసన సభ్యులుగా ఉండేవారని, గుల్కోట శ్రీరాములు స్వాతంత్య్ర సమరయోధుడు, మొట్టమొదటి మంథని శాసన సభ్యులుగా ఉండేవారని వారి విగ్రహాలను సైతం మంథనలో ఆవిష్కరించుకోవడం సంతోషంగా ఉందన్నారు.
కులాలు మతాలతో సంబంధం లేకుండా ఎవరైతే మన గురించి ఆలోచన చేసి తమ జీవితాలు త్యాగం చేశారో అలాంటి మహనీయుల చరిత్రను తెలుసుకోవాల్సిన అవసరం ప్రతి ఒక్కరిపై ఉందన్నారు.
నగరం నడి ఒడ్డున ఎస్సీలు, బీసీల విగ్రహాలు మాత్రమే ఉన్నాయని, అనేక ఏండ్లు ఈ సమాజం గురించి ఆలోచించిన వారిలో ఎక్కువగా ఎస్సీలు,బీసీలు మాత్రమే ఉన్నారన్నారు.
మహనీయుల స్పూర్తితోనే ఈనాడు సీఎం కేసీఆర్ పాలన అందిస్తున్నారని, తెలంగాణ ఉద్యమ సమయంలో వారి త్యాగాలను స్మరించుకోని రోజులేదన్నారు.మంథని నియోజకవర్గంలో మహనీయుల గురించి చర్చంచబడలేదని,మన గురించి చెప్పబలేదన్నారు.
అంబేద్కర్ రచించిన రాజ్యాంగం తెలియని పరిస్థితులు ఉన్నాయని, రాజ్యాంగం మనకు తెలిసి ఉంటే తమన తలరాతలు ఎన్నడోమారేవన్నారు. అంబేద్కర్ను ఎస్సీలకు మాత్రమే పరిమితం చేసి సమాజానికి దూరంచేసిండ్లని, అంబేద్కర్ ఎస్సీలు, బీసీల గురించి ఆలోచన చేశారని ఆయన గుర్తు చేశారు. అంబేద్కర్నగర్ చెరువులో అంబేద్కర్, గౌతమ బుద్దుడి విగ్రహ ఏర్పాటుకు యువత ఎంతో కష్టపడ్డారని ఆయన కొనియాడారు.
ఎస్సీలు, బీసీలు అంటే ముట్టుకోనివారు కాదని ముట్టుకునేటోళ్లని చూపించాలన్నదే తన ఆకాంక్ష అని అన్నారు. ఈ సమాజానికి ఎస్సీలను బీసీలను గొప్పగా చూపించడమే తన లక్ష్యమన్నారు.
రేపటి సమాజ మార్పు కోసం తన పోరాటం కొనసాగుతుందని, సోమవారం నుంచి నియోజవకర్గంలో ప్రజా ఆశీర్వాద యాత్రకు శ్రీకారం చుట్టామని, ప్రజలు ఆశీర్వాదం అందించాలని ఆయన కోరారు.