రాష్ట్రంలో వచ్చే ఐదు రోజులు తేలికపాటి నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడిందని, ఉపరితల ఆవర్తనం కూడా కొనసాగుతున్నదని పేర్కొన్నది.
వీటి ప్రభావంతో మంగళవారం నుంచి అక్టోబర్ ఒకటి వరకు పలుచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వెల్లడించింది.
హైదరాబాద్, సెప్టెంబర్ 27 రాష్ట్రంలో వచ్చే ఐదు రోజులు తేలికపాటి నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడిందని, ఉపరితల ఆవర్తనం కూడా కొనసాగుతున్నదని పేర్కొన్నది. వీటి ప్రభావంతో మంగళవారం నుంచి అక్టోబర్ ఒకటి వరకు పలుచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. పలుచోట్ల ఉరుములు మెరుపులతో వానలు కురిసే అవకాశాలున్నాయని అంచనా వేసింది. ఈ మేరకు పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్‌ను జారీచేసింది. ఆదిలాబాద్, మహబూబ్‌నగర్, ఖమ్మం, సూర్యాపేటతోపాటు పలుచోట్ల మంగళవారం వర్షాలు కురిశాయని టీఎస్‌డీపీఎస్ వివరించింది. భద్రాద్రి-కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండలం సీతారాంపురంలో అత్యధికంగా 37.3 మి.మీ, ఖమ్మం జిల్లా సత్తు