రాష్ట్ర ప్రజలకు మరో ప్రతిష్ఠాత్మక రోడ్డు అందుబాటులోకి రానున్నది. కల్వకుర్తి నుంచి కొల్లాపూర్ వరకు నిర్మించే ఈ రోడ్డు పనులు ప్రారంభమయ్యాయి.
కృష్ణా నదిపై 4 లేన్ల ఐకానిక్ కేబుల్ బ్రిడ్జి నిర్మాణానికి సన్నాహాలు
హైదరాబాద్-తిరుపతి మధ్య 50 కి.మీ. తగ్గనున్న ప్రయాణ దూరం
రాష్ట్ర ప్రజలకు మరో ప్రతిష్ఠాత్మక రోడ్డు అందుబాటులోకి రానున్నది. కల్వకుర్తి నుంచి కొల్లాపూర్ వరకు నిర్మించే ఈ రోడ్డు పనులు ప్రారంభమయ్యాయి. కృష్ణా నదిపై 4 లేన్ల ఐకానిక్ కేబుల్ బ్రిడ్జి నిర్మాణం ద్వారా ఏపీలోని నంద్యాల వరకు సాగే ఈ రోడ్డుతో హైదరాబాద్-తిరుపతి మధ్య ప్రయాణ దూరం దాదాపు 50 కి.మీ. మేరకు తగ్గుతుంది. ప్రస్తుతం ఈ ఐకానిక్ బ్రిడ్జి నిర్మాణం టెండర్ల దశలో ఉన్నది. ఏపీలో భూసేకరణ సమస్యల వల్ల ఈ రోడ్డు నిర్మాణం నత్తనడకన సాగుతున్నప్పటికీ తెలంగాణలో టెండర్ల ప్రక్రియ పూర్తికావడంతో పనులు చేపట్టారు.
కల్వకుర్తి టౌన్‌లోని జంక్షన్ నుంచి ప్రారంభమైల్ నాగర్‌కర్నూ, కొల్లాపూర్, సోమశిలతోపాటు ఏపీలోని సంగమేశ్వరం, ఆత్మకూర్, వెలుగోడు మీదుగా నంద్యాల వరకు సాగే ఈ రోడ్డును కేంద్ర ప్రభుత్వం ఎన్‌హెచ్ 167కేగా ప్రకటించింది