వెంటనే ఉద్యోగ కల్పన
అప్పటినుంచి ఇప్పటివరకు నిరుద్యోగ భృతి ఇవ్వాలని కోరుతూ కేంద్ర మంత్రి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి గారు నిన్న ఇందిరా పార్కు వద్ద శాంతి యుతంగా24గంటల నిరాహార దీక్షను చేస్తుంటే
రాత్రి పోలీసులు అక్రమంగా అత్యంత దారుణంగా మహిళలను కూడా విషక్షణా రహితంగా తోసివేసి అరెస్టు చేయడం సిగ్గుమాలిన చర్య అని రంగారెడ్డి జిల్లా బీజేపీ ఉపాధ్యక్షుడు పెద్దయెల్కిచర్ల సర్పంచ్ కమ్మరిభూపాలాచారి అన్నారు
అక్రమ అరెస్టు లకు నిరసనగా ఈరోజు జిల్లేడు చౌదరిగూడెం మండల కేంద్రం లో నిరసన ప్రదర్శన నిర్వహించారు
ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ కేసీఆర్ కు ఏమాత్రం చిత్తశుద్ధి వున్నా వెంటనే నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించాలని నిరుద్యోగ భృతి వెంటనే ఇవ్వాలని డిమాండ్ చేశారు
చేతకాక పోతే వెంటనే రాజీనామా చేయాలని కోరారు
శాంతి యుతంగా చేస్తున్న నిరసన ను పోలీసులు అడ్డుకొని అరెస్టు చేశారు ఇది అప్రజాస్వామిక చర్య అని
రాష్ట్రంలో ప్రజాస్వామ్య పాలన నడుస్తుందా లేక నయా నిజాం పాలన నడుస్తుందా అని ప్రశ్నించారు
కార్యక్రమంలో మండల బిజెపి అధ్యక్షుడు బోయ కురుమయ్య ప్రధాన కార్యదర్శులు సురేష్ మురళి,Bjym మండల అధ్యక్షుడు ఉప సర్పంచ్ అనిల్ కుమార్, దళితమోర్ఛా నాయకులు చెన్నగాళ్ల కృష్ణయ్య, నర్సింలు, భీంరాజ్, రామచంద్రయ్య, యాదయ్య, శ్రీను,హరీష్,వెంకటేష్,లింగం, భీమయ్య, రమేశ్,రామకృష్ణ, నరేష్,తదితరులు పాల్గొన్నారు
