– అక్టోబర్ 1వ తేదీ నుంచి మెడికల్ క్యాంపులు
– నారాయణపురంలో నాలుగేళ్లలో రూ.28 కోట్లతో అభివృద్ధి
– సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించండి
– సచివాలయ సిబ్బంది, వాలంటీర్లతో ఎమ్మెల్యే అనంత
– పంచాయతీలో కొత్తగా 91 మందికి పింఛన్లు పంపిణీ
అనంతపురం, సెప్టెంబర్ 14 :
ప్రజల ఆరోగ్య సంరక్షణే లక్ష్యంగా ప్రారంభించనున్న ‘జగనన్న ఆరోగ్య సురక్ష’ ఇంటింటి సర్వేను పక్కాగా చేపట్టాలని అనంతపురం ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి ఆదేశించారు. గురువారం సాయంత్రం అనంతపురం నియోజకవర్గ పరిధిలోని నారాయణపురం 1, 2, 3 సచివాలయాల్లో సిబ్బంది, వాలంటీర్లతో ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ నెల 15 వతేదీ నుంచి 30 వతేదీ వరకు గ్రామ, వార్డు సచివాలయాల పరిధిలో వాలంటీర్లు ప్రతి ఇంటికి వెళ్లి సర్వే చేయాలన్నారు. వైద్య సేవలు అవసరమైన వారిని గుర్తించాలని తెలిపారు. అక్టోబర్ 1 వ తేదీనుంచి 30 వతేదీ వరకు అన్ని సచివాలయాల పరిధిలో మెడికల్ క్యాంపులు నిర్వహించనున్నట్లు చెప్పారు. వైద్య శిబిరాల్లో 14 రకాల వైద్యసేవలు అందుతాయని, 105 రకాల మందులను ఉచితంగా అందించనున్నట్లు చెప్పారు. ఈ విషయాలన్నీ ప్రజలకు వివరించాలని తెలిపార