మంత్రి కేటీఆర్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన ఆరోగ్య శ్రీ ట్రస్ట్ చైర్మన్ డాక్టర్ సుధాకర్ రావు

హైదరాబాద్‌ :సెప్టెంబర్ 14
ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి కేటీఆర్‌ను ఆరోగ్యశ్రీ ట్రస్ట్ చైర్మన్‌గా ఇటీవల నియమితులైన మాజీ ఎమ్మెల్యే డాక్టర్ ఎన్.సుధాకర్ రావు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుతో పాటు గురువారం ప్రగతి భవన్ లో కలిశారు.

ఈ సందర్భంగా పుష్పగుచ్ఛం ఇచ్చి మంత్రి కేటీఆర్‌కు సుధాకర్ రావు కృతజ్ఞతలు తెలిపారు. అలాగే మంత్రి కేటీఆర్‌ సుధాకర్ రావుకు శుభాకాంక్షల తెలిపారు. కేటీఆర్‌ని కలిసిన వారిలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌ రావు, ఎమ్మెల్సీ కడియం శ్రీహరి తదితరులు ఉన్నారు….

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *