హైదరాబాద్:సెప్టెంబర్ 14
టీఎస్ ఎడ్‌సెట్, పీఈసెట్ కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదలైంది. ఈ షెడ్యూల్‌ను ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ ఆర్ లింబాద్రి, వైస్ చైర్మన్ ప్రొఫెసర్ ఎస్‌కే మహ్మద్, సెక్రటరీ డాక్టర్ ఎన్ శ్రీనివాస్ రావు, ఎడ్‌సెట్, పీఈసెట్ కన్వీనర్ ప్రొఫెసర్ పీ రమేశ్ బాబు కలిసి విడుదల చేశారు.
కౌన్సెలింగ్‌కు సంబంధించిన నోటిఫికేషన్‌ను ఈ నెల 19న విడుదల చేయనున్నారు. ఎడ్‌సెట్ ప్రవేశాలకు సంబంధించి ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్, వెరిఫికేషన్, ఆన్‌లైన్ పేమెంట్‌కు సంబంధించిన వివరాలను 20వ తేదీ నుంచి 30 లోపు నమోదు చేయాల్సి ఉంటుంది. ఎన్‌సీసీ, పీహెచ్, స్పోర్ట్స్ అభ్యర్థులకు సంబంధించి ఫిజికల్ వెరిఫికేషన్ 25 నుంచి 29వ తేదీ మధ్యలో ఉంటుంది. వెబ్ ఆప్షన్స్ అక్టోబర్ 3 నుంచి 5వ తేదీ వరకు నమోదు చేసుకోవాలి.
అక్టోబర్ 6న వెబ్ ఆప్షన్లను ఎడిట్ చేసుకునేందుకు అవకాశం కల్పించారు. ఫస్ట్ ఫేజ్ సీట్ల కేటాయింపు అక్టోబర్ 9న జరగనుంది. అక్టోబర్ 10 నుంచి 13వ తేదీ మధ్యలో కాలేజీల్లో రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుంది. 30వ తేదీ నుంచి తరగతులు ప్రారంభం కానున్నాయి.
పీఈసెట్ కౌన్సెలింగ్‌కు సంబంధించి ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్, వెరిఫికేషన్, ఆన్‌లైన్ పేమంట్ వంటి అంశాలు 20 నుంచి 25వ తేదీ మధ్యలో జరగనున్నాయి.
సెప్టెంబర్ 24 నుంచి 25వ తేదీ మధ్యలో ఎన్‌సీసీ, పీహెచ్, స్పోర్ట్స్ అభ్యర్థులకు సంబంధించి ఫిజికల్ వెరిఫికేషన్ ఉంటుంది. సెప్టెంబర్ 28, 29 తేదీల్లో వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకోవచ్చు.
ఈ నెల 30వ తేదీన వెబ్ ఆప్షన్లను ఎడిట్ చేసుకునేందుకు అవకాశం కల్పించారు. అక్టోబర్ 3వ తేదీన ఫస్ట్ ఫేజ్ సీట్లను కేటాయించనున్నారు. సీట్లు పొందిన విద్యార్థులు అక్టోబర్ 4 నుంచి 7వ తేదీ మధ్యలో కాలేజీల్లో రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుంది…