హైదరాబాద్:సెప్టెంబర్ 14
డ్రగ్స్ దందా చేస్తూ మరో సినీ నిర్మాత పట్టుబడ్డాడు. అతనితోపాటు ఓ మాజీ పార్లమెంట్ సభ్యుడి కుమారుడు, ముగ్గురు నైజీరియన్లతోపాటు మొత్తం 8 మందిని తెలంగాణ యాంటీ నార్కోటిక్ బ్యూరో అధికారులు గుడిమల్కాపూర్ పోలీసులతో కలిసి అరెస్ట్ చేశారు.
టాలీవుడ్ లో సినీ నిర్మాతగా ఉన్న సుశాంత్ రెడ్డి అనే వ్యక్తి డ్రగ్స్ దందా చేస్తున్నట్టు యాంటీ నార్కోటిక్ అధికారులకు పక్కాగా సమాచారం అందింది. ఈ క్రమంలో గుడిమల్కాపూర్ పోలీసులతో కలిసి యాంటీ నార్కోటిక్ బ్యూరో అధికారులు సుశాంత్ రెడ్డితోపాటు ముగ్గురు నైజీరియన్లను గుడిమల్కాపూర్ ప్రాంతంలో అరెస్ట్ చేశారు.
వీరి నుంచి డ్రగ్స్ కొంటున్న మరో అయిదుగురిని కూడా అదుపులోకి తీసున్నారు. వీరిలో ఓ మాజీ ఎంపీ కుమారుడు ఉన్నట్టు సమాచారం. హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ ఈరోజు సాయంత్రం పూర్తి వివరాలు వెల్లడించనున్నట్లు సమాచారం..