నేటి రాశిఫలాలు : 15/09/2023 శుక్రవారము.

మేషం

దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల నుండి ఉపశమనం లభిస్తుంది. భూ సంబంధిత క్రయ విక్రయాలు లాభసాటిగా సాగుతాయి. చేపట్టిన వ్యవహారాలు సకాలంలో పూర్తి చేస్తారు. కుటుంబంలో చిక్కులు తొలగుతాయి. నూతన వస్త్ర ఆభరణాలు కొనుగోలు చేస్తారు ఉద్యోగాలలో నూతన ప్రోత్సాహకాలు అందుతాయి.
—————————————
వృషభం

ఇంటా బయట బాధ్యతలు పెరుగుతాయి. ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నవి. దైవ సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. సన్నిహితులతో అకారణంగా వివాదాలు కలుగుతాయి. వృత్తి వ్యాపారాలలో స్వంత ఆలోచనలు కలసిరావు. వ్యాపారాలు మందగిస్తాయి. ఉద్యోగాలలో గందరగోళ పరిస్థితులు ఉంటాయి.
—————————————
మిధునం

వృత్తి వ్యాపారాలలో వ్యయప్రయాసలు అధికమవుతాయి. బంధువుల నుంచి ఋణ ఒత్తిడులు తప్పవు. ఆర్థికపరమైన సమస్యలు చికాకు కలిగిస్తాయి. వృధా ప్రయాణాలు చేయవలసి వస్తుంది. చేపట్టిన పనులలో ఎంత కష్టించినా ఫలితం ఉండదు. ఉద్యోగ వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి.
—————————————
కర్కాటకం

కీలక వ్యవహారాలలో ఆప్తుల సలహాలు కలసి వస్తాయి. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. అనుకున్న సమయానికి అనుకున్న విధంగా పనులు పూర్తి చేస్తారు. ఆలయ దర్శనాలు చేసుకుంటారు. వ్యాపార, ఉద్యోగాలు సంతృప్తికరంగా సాగుతాయి.
—————————————
సింహం

వ్యాపారాలలో తొందరపాటు నిర్ణయాల వలన నష్టాలు తప్పవు. దైవదర్శనాలు చేసుకుంటారు. చేపట్టిన పనుల్లో జాప్యం కలుగుతుంది. ఆర్థిక ఇబ్బందులు చికాకు పరుస్తాయి. కుటుంబ వ్యవహారాలలో ఆలోచనలు స్థిరంగా ఉండవు. ఉద్యోగాలలో ఉన్నతాధికారుల నుండి ఆటుపోట్లు తప్పవు.
—————————————
కన్య

ప్రముఖులతో పరిచయాలు విస్తృతమౌతాయి. సన్నిహితుల నుండి విలువైన వస్తువులు బహుమతులుగా పొందుతారు. దీర్ఘకాలిక సమస్యలు తీరి ఊపిరి పీల్చుకుంటారు. ఆకస్మిక ధనలాభ సూచనలు ఉన్నవి. స్థిరాస్తి కొనుగోలు చేస్తారు. వ్యాపార, ఉద్యోగాలు మరింత పుంజుకుంటాయి.
—————————————
తుల

కుటుంబంలో చిన్నపాటి సమస్యలు ఉంటాయి. ఇంటాబయట నిరాశ తప్పదు. వ్యాపారాలు కొంత మందకోడిగా సాగుతాయి. బంధువుల నుంచి ఒత్తిడులు పెరుగుతాయి. వ్యాపార వ్యవహారాలలో ఆలోచనలు స్థిరంగా ఉండవు. నిరుద్యోగ ప్రయత్నాల్లో ఆటంకాలు కలుగుతాయి.
—————————————
వృశ్చికం

ఆత్మీయులతో సఖ్యతగా వ్యవహరిస్తారు. ఆకస్మిక ధనలాభ సూచనలు ఉన్నవి. పనులు సకాలంలో పూర్తి చేస్తారు. సమాజంలో ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగాలలో నూతన బాధ్యతలు పెరుగుతాయి.
—————————————
ధనస్సు

ప్రయాణాలు శ్రమతో కూడుకుని ఉంటాయి. ఆధ్యాత్మిక విషయాలపై దృష్టి సారిస్తారు. బంధువులతో ఊహించని వివాదాలు కలుగుతాయి. అనుకున్న పనుల్లో అవాంతరాలు తప్పవు. నూతన రుణయత్నాలు చేస్తారు. వ్యాపారాలు కొంత నిదానంగా సాగుతాయి. ఉద్యోగాలలో వివాదాలకు దూరంగా ఉండడం మంచిది.
—————————————
మకరం

ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ అవసరానికి ధనం అందుతుంది. దూరప్రయాణాలలో అప్రమత్తంగా వ్యవహరించాలి. సన్నిహితులతో విభేదాలు కలుగుతాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపార విస్తరణ ప్రయత్నాలు సాదాసీదాగా ఉంటాయి. ఉద్యోగస్తులకు అదనపు పనిభారం ఉంటుంది.
—————————————
కుంభం

కుటుంబ విషయాలలో తొందరపాటు నిర్ణయం చేయడం మంచిది కాదు. మిత్రుల నుంచి విమర్శలు కలుగుతాయి. అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. ఇంటా బయట పరిస్థితులు అనుకూలిస్తాయి. చేపట్టిన పనులలో శ్రమాధిక్యత కలుగుతుంది. వృత్తి ఉద్యోగాలలో ఇతరులతో నిదానంగా ప్రవర్తించడం మంచిది.
—————————————
మీనం

సన్నిహితుల నుండి శుభవార్తలు అందుతాయి. గృహ నిర్మాణ ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. పనులు సకాలంలో పూర్తి చేస్తారు. సమాజంలో ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. ఆకస్మిక ధన లాభ సూచనలు ఉన్నవి. వ్యాపార, ఉద్యోగాలలో మీ శ్రమకు తగిన ఫలితం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *