తవణంపల్లి మండలం ఐరాల క్రాస్ సమీపంలో రోడ్డుకు అడ్డంగా పడి ఉన్న చెట్టును ఢీకొని వ్యక్తి మృతి చెందిన సంఘటన సోమవారం చోటు చేసుకుంది. ఎస్సై కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. రోడ్డుకు అడ్డంగా వేసి ఉంచిన చెట్టుని ప్రమాదవశాత్తు ఢీకొని క్రిందపడడంతో తలకు తీవ్రరక్తగాయాలై అక్కడికక్కడే మృతి చెందినట్లు పోలీసులు తెలియజేశారు.