చంద్రబాబు నాయుడు చేసిన అవినీతికి తగిన గుణపాఠం లభించింది.

వ్యవస్థల్ని మేనేజ్ చేయటంలో చంద్రబాబు నాయుడు దిట్ట:: విడుదల రజిని

టిడిపి ఇచ్చిన బందుకు కనీస స్పందన కరువైంది

చిలకలూరిపేట పట్టణంలోనే స్థానిక వైఎస్ఆర్ సీపీ కార్యాలయంలో ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సోమవారం సాయంత్రం మీడియా సమావేశం ఆమె మాట్లాడుతూన్యాయం నిలిచింది ధర్మం గెలిచింది ఎన్నాళ్లు తర్వాత నిన్న చంద్రబాబు నాయుడు సాక్షాదారాలతో అడ్డంగా దొరికిపోయారు. స్కిల్ డెవలప్మెంట్ స్కీముకు సంబంధించి ఆధారాలతో న్యాయ దేవత సాక్షిగా నారా చంద్రబాబు నాయుడు ఏ విధంగా దొరికిపోయాడో ఈ రాష్ట్ర ప్రజలందరూ చూశారు. చంద్రబాబు నాయుడు వ్యవస్థల్ని మేనేజ్ చేయడంలో దిట్ట. ఇన్ని సంవత్సరాలుగా తన రాజకీయ జీవితంలో ఈ వ్యవస్థలన్నిటిని కూడా మేనేజ్ చేస్తూ ఈ రాష్ట్రంలో ఎన్ని అక్రమాలకు పాటుపడిన ఎంత అవినీతి చేసినా మరి ఈ రాష్ట్రం పలు రకాలుగా ఏ విధమైనటువంటి అవినీతికి పాల్పడినాడ కూడా తనకున్నటువంటి ఈ వ్యవస్థలన్నీ మేనేజ్ చేసే ఎబిలిటీతో ఇప్పటిదాకా కూడా తప్పించుకుని వస్తున్నారు. మరి 40 సంవత్సరాల చంద్రబాబు నాయుడు రాజకీయ జీవితంలో నేను నిప్పులా జీవించానని చంద్రబాబు నాయుడు ఏవైతే ప్రగల్బాలు పలుకుతున్నారో అవన్నీ అసత్యం అని నిన్నటితో న్యాయదేవత సాక్షిగా తేలిపోయింది. మరి స్కిల్ డెవలప్మెంట్ స్కీం సంబంధించి 370 కోట్లు రూపాయలు ఒక కాన్సెప్ట్ ప్రోగ్రాం ని వాళ్ళు ఆలోచన చేసి వాళ్లు దోచుకునేందుకు ఈ ప్రోగ్రాంనే ఎంచుకొని ఈ ప్రోగ్రాంకు సంబంధించి సిమెన్స్ అనే ప్రైవేట్ కంపెనీతో ఒప్పందం కొలుచుకున్నారు. ఈ మొత్తం స్కీం సంబంధించి 90% సి మెన్స్ కంపెనీ మరియు 10% గత రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాల్సి ఉంది. ఈ ప్రోగ్రాం కి సంబంధించి అయితే అప్పటి ప్రభుత్వం క్యాబినెట్లో ఒకలాగా పెడతారు జీవోలో ఒక లాగిస్తారు దాని పేమెంట్ మరొక లాగా చేస్తారు. మరి చుట్టూ తిరిగి 90% సంబంధించి ఒక్క రూపాయి కూడా పడకుండా 371 కోట్లు రూపాయలు ఏ విధంగా షెల్ కంపెనీల ద్వారా తిరిగి తిరిగి ఎలా చంద్రబాబు జేబులోకి చేరుతాయి అన్నది ఈ స్కీం.. దీనికి సంబంధించి అన్ని ఆధారాలతో నిన్న కోర్టు రిమాండ్ విధించి తరువాత చంద్రబాబు నాయుడిని జైలుకు కూడా పంపింది.

మరి ఏ రోజు కూడా చంద్రబాబు నాయుడు ఇంత అడ్డగోలుగా ఆయన చేసిన అవినీతికి ఇలా దొరికిపోతానని ఊహించి ఉండడు. ఈయన చేసిన అవినీతికి సరైన గుణపాఠం లభించిందని రాష్ట్ర ప్రజలందరికీ అర్థమవుతుంది..

ఇది ఇలా ఉండగా టిడిపి నాయకులు అందరూ తప్పు చేసింది చంద్రబాబు నాయుడు ఆధారలతో దొరికింది చంద్రబాబు నాయుడు ఇదేదో మా ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తుందని మా నాయకుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి కక్ష సాధింపు చర్యగా ఈ విధంగా చేస్తున్నారని పదేపదే టిడిపి నాయకులు మా మీద మా ప్రభుత్వం మీద దృశప్రచారం చేస్తున్నారు. ఇలా మా ప్రభుత్వంపై మా నాయకుడి వైయస్ జగన్మోహన్ రెడ్డి పై మాట్లాడటం ఎంతవరకు కరెక్ట్.

తప్పు చేసింది మీరు అడ్డగోలుగా అవినీతి చేసి దొరికింది మీరే మీరు మమ్మల్ని మాట్లాడతారా మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి మంచి పనుల ద్వారా ప్రజలకు చేదోడు వాదోడుగా ఉండటం ద్వారా ప్రజలకు అనేక విధాలుగా భరోసాని ఇవ్వటం ద్వారా అధికారంలోకి రావచ్చు అనే గొప్ప సిద్ధాంతాన్ని నమ్మిన వ్యక్తి మా వైయస్ జగన్మోహన్ రెడ్డి. ఇలా కక్ష సాధింపు చర్యల ద్వారా ప్రజలను ఇబ్బంది పడే ఏదో చేసి ఇలాంటి అన్ని కూడా ఏదో చేయాలని ఆలోచన లేనటువంటి వ్యక్తి. కేవలం ప్రజలకు మంచి చేయడం ద్వారా ప్రజల మెచ్చుకునేలా గొప్ప సిద్ధాంతం నమ్మిన వ్యక్తి మా నాయకుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి. అదే పద్ధతిలో అదే సిద్ధాంతంతో మేము మా మా నాయకులు నడుచుకుంటూ ప్రజలకు మరిన్ని సేవ చేయాలనే భావనతో ముందుకు వెళ్తున్నాం. ఇలాంటి మోసపూరిత రాజకీయాలు గానీ ఇలాంటి పద్ధతులు గాని మేము చేయము.. నమ్మము… ఇది మా పద్ధతి కాదు మీరు తప్పుచేసి ఈరోజు మమ్మల్ని అంటున్నారు.

చంద్రబాబు నాయుడు జైలుకు వెళ్తే టిడిపి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మొత్తం బంధు పిలుపునిచ్చింది టిడిపి ఇచ్చిన బందుకు కనీసం స్పందన కరువైంది.అని రాష్ట్ర ప్రజలందరికీ అర్థమవుతుంది. చంద్రబాబు నాయుడు అవినీతి చేశారు అడ్డంగా దొరికిపోయాడు చంద్రబాబు నాయుడు ఎన్ని అవినీతి పనులు చేశారో ప్రజలకు అర్థమవుతుంది. గత రాష్ట్ర ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు చేసిన అన్ని అవినీతి పనులను బయటకు తెస్తాం అని చట్టం తన పని తాను చేస్తుంది చట్టానికి అందరూ సమానమే చట్టం ఎవరికి చుట్టం కాదు.. అని తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *