దేశ వైద్య రంగంలో తెలంగాణలో నేడు సరికొత్త రికార్డు నమోదు కానుంది. తొమ్మిది ప్రభుత్వ వైద్య కళాశాలల్లో తరగతులు ప్రారంభం కానున్నాయి. కామారెడ్డి, కరీంనగర్, ఖమ్మం, జయశంకర్ భూపాలపల్లి, కుమ్రంభీం ఆసిఫాబాద్, నిర్మల్, రాజన్న సిరిసిల్ల, వికారాబాద్, జనగాం జిల్లాల్లో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన మెడికల్ కాలేజీల్లో వర్చువల్ తరగతులను సీఎం కేసీఆర్ ప్రారంభించనున్నారు..
