తెలంగాణ: రేషన్ బియ్యం పక్కదారి పట్టకుండా ఆహార భద్రత కార్డుల్లో అనర్హుల పేర్లను తొలగించే ప్రక్రియ ప్రారంభమైంది నిజమైన పేదలకే రేషన్ సరుకులందేలా ప్రభుత్వం చర్యలు చేపట్టింది ఈ నేపథ్యంలో కార్డులో పేరు ఉన్న కుటుంబీకులంతా రేషన్ షాపుకు వెళ్లి ఈ-కేవైసీ చేయించుకోవాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది ఈ మేరకు జిల్లాలలో రేషన్ డీలర్లు అనుసంధాన ప్రక్రియను ప్రారంభించారు కొత్త రేషన్ కార్డుల జారీకి ముందు ప్రభుత్వం అననర్హుల పేర్లు తొలగింపునకు చర్యలు చేపట్టింది.
ఆహార భద్రత కార్డు (రేషన్ కార్డు) లో పేరున్న కుటుంబీకులలో ఒక్కొక్కరికి నెలకు ఆరు కిలోల బియ్యం పంపిణీ చేస్తున్నారు కార్డులో పేరున్నవారు ఎవరు దుకాణానికి వెళ్లినా బయోమెట్రిక్ తీసుకొని బియ్యం ఇస్తున్నారు ఇదిలాఉండగా కొన్నేళ్ళుగా రేషన్ కార్డుల తనిఖీలు చేయకపోవడంతో కార్డులో పేరున్న కొందరు చనిపోవడం కొందరి కుమార్తెలు పెళ్లి చేసుకొని అత్తారింటికి వెళ్లిపోయారు కార్డుల్లో పేర్ల తొలగింపు చేయకపోవడంతో సదరు కుటుంబంలో సభ్యులు ఉన్నా లేకున్నా పేరున్న అందరికీ రేషన్ అందుతోంది.
ఈ నేపథ్యంలో బియ్యం దుర్వినియోగం కావొద్దని ప్రభుత్వం పేర్ల ధ్రువీకరణ కోసం రేషన్ షాపుల్లోనే ఈ-పాస్ మిషన్లతో ఈ-కేవైసీ చేయించాలని నిర్ణయించింది దీంతో కార్డుల్లో పేరున్నవారు ఈ-కేవైసీ చేసుకోవాలని డీలర్లు సైతం లబ్ధిదారులకు సమాచారం ఇస్తున్నారు కాగా కేవైసీ ప్రక్రియ డీలర్లకు తలనొప్పిగా మారనుంది. వృద్ధులు పిల్లల వేలి ముద్రలు ఆధార్ అప్రూవ్ కావడం లేదు కొందరు సొంతూరులో కార్డున్నా వేరే ప్రాంతాల్లో స్థిరపడ్డారు. దీంతో వారు కార్డు ఉన్న రేషన్ షాపుకు వెళ్లి ఈ-కేవైసీ చేయించుకోకుంటే కార్డులో పేర్లు తొలగించే అవకాశం ఉంది.
ఈ-కేవైసీ ఎలా..?
రేషన్ కార్డులో పేరున్న కుటుంబీకులంతా రేషన్ షాపుకు వెళ్లి బయోమెట్రిక్ వేలిముద్రలు వేయాలి. వాటిని రేషన్ డీలర్లు ఈ-పాస్ మిషన్లో తీసుకుంటారు వేలిముద్ర వేయగానే లబ్ధిదారు ఆధార్ నెంబర్ డిస్‌ప్లే అవుతుంది మిషన్లో పచ్చబల్బు వెలిగిందంటే ఈ-కేవైసీ ప్రక్రియ పూర్తయినట్టే.! ఒకవేళ ఎర్రబల్బు వెలిగితే రేషన్ కార్డులో పేరున్న వ్యక్తి ఆధార్ మ్యాచ్ కాలేదని ఈ-కేవైసీ రిజెక్ట్ అవుతుంది.
అలాంటి వారి పేర్లను రేషన్ కార్డు నుంచి తొలగిస్తారు. ఈ మేరకు రేషన్ సరుకులు కట్ చేస్తారు ఈ-కేవైసీ కోసం కార్డులో పేరున్న వ్యక్తులంతా ఒకేసారి రేషన్ షాపుకు వెళ్లి వేలిముద్రలు ఇవ్వాలి ఎవరు వెళ్లకున్నా వారు ఆ కుటుంబంతో విడిపోయారని భావించి కార్డు నుంచి వారి పేర్లను తొలగిస్తారు.
ప్రతీ కుటుంబం తప్పనిసరి..
కుటుంబ యజమానితో పాటు రేషన్ కార్డులో పేరున్న కుటుంబ సభ్యులందరూ రేషన్ దుకాణానికి వెళ్లి వేలిముద్రలు వేయాలి అందరూ ఒకేసారి వెళ్తే ప్రక్రియ పూర్తవుతుంది రేషన్ డీలర్లు ఈ-పాస్ మిషన్ ద్వారా వేలిముద్రలు తీసుకుంటారు వేలిముద్ర వేయగానే ఓకే అంటే వారి ఆధార్ నంబర్‌తో పాటు రేషన్ కార్డు నంబరు డిస్‌ప్లే అవుతుంది. పచ్చబల్బు వెలిగి ఈ-కేవైసీ ప్రక్రియ పూర్తవుతుంది.