ఉగ్రవాదులకు ఆవాసంగా పీర్ పంజాల్ పర్వత శ్రేణులు!
జమ్మూకశ్మీర్ అనంతనాగ్ జిల్లా కొకెర్నాగ్ ప్రాంతంలోని పీర్ పంజాల్ పర్వత శ్రేణులు ఉగ్రవాదులకు ఆవాసాలుగా మారుతున్నాయి. సరిహద్దు దాటుకొని వచ్చిన ఉగ్రమూకలు శ్రీనగర్, డోడా ప్రాంతాలకు వెళ్లాలంటే అనంతనాగ్ మీదుగానే ప్రయాణించాలి. 15వేల అడుగుల ఎత్తుండే ఈ పర్వత శ్రేణుల్లో సైనిక ఆపరేషన్లు చేపట్టడం కష్టతరం. ప్రస్తుతం ఇక్కడ నక్కిన ఉగ్రమూకను మట్టుబెట్టేందుకు డ్రోన్లను ఉపయోగించి ఆర్మీ ఎదురుదాడి చేస్తోంది.