విద్యార్థులు క్రమశిక్షణ తప్పితే ఉపాధ్యాయులు వారికి తగిన శిక్ష విధించి దారిలో పెడతారు. కానీ చిత్తూరు జిల్లా పాలసముద్రం మండలంలోని ఎస్ఆర్కండ్రిగ జడ్పీ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు మనోహర్నాయుడు ఇందుకు భిన్నంగా వ్యవహరించారు. తాను పనిచేసే పాఠశాలలో విద్యార్థులు నిత్యం సకాలంలో రావాలని, తప్పక యూనిఫాం ధరించాలని మొదట్లోనే సూచించారు. క్రమశిక్షణ తప్పితే శిక్ష విద్యార్థులకు ఇవ్వబోనని, తానే ఆ శిక్ష అనుభవిస్తానని చెప్పారు. ఈ నేపథ్యంలో ఇవాళ విద్యార్థులు ఆలస్యంగా రావడం, యూనిఫాం ధరించకపోవడంతో మోకాళ్లపై నిల్చొని చేతులు కట్టుకుని తనకు తాను శిక్ష విధించుకున్నాడు. అక్కడ పనిచేసే మరో ఉపాద్యాయుల ఫోన్ నుండి లీక్ అయిన ఈ చిత్రం నెట్టింట హల్ చల్ చేస్తుంది.
