నేడే తుది పోరు.. టైటిల్ కోసం త‌ల‌ప‌డ‌నున్న భార‌త్, శ్రీలంక

నేడే తుది పోరు.. టైటిల్ కోసం త‌ల‌ప‌డ‌నున్న భార‌త్, శ్రీలంక

కొలంబో : సెప్టెంబర్ 17
ఆసియా కప్ టోర్నమెంట్ తుది దశకు చేరుకుంది. సూపర్ 4 లో సత్తాచాటిన భారత్, శ్రీలంక జట్లు ఇప్పుడు ఫైనల్ కు చేరుకున్నాయి.

నేడు ఆదివారం భారత్, శ్రీలంక మధ్య ఫైన‌ల్ మ్యాచ్ జరగనుంది.

కాగా, డిఫెండింగ్ ఛాంపియన్స్ గా బరిలో దిగిన శ్రీలంక, మరోసారి ట్రోఫీని సొంతం చేసుకోవాలని చూస్తుండగా.. భారత్ కూడా టైటిల్ గెలిచి సమం చేయాలని చూస్తోంది. ఈ మ్యాచ్ కోసం క్రికెట్ అభిమానులు సైతం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

ఆదివారం జరిగే ఫైనల్ మ్యాచ్ లో వర్షం పడే సూచనలు ఎక్కువగా ఉన్నట్లు శ్రీలంక వాతావరణ సంస్థ ప్రకటించింది.ఒకవేళ అదే జరిగితే..?

శ్రీలంకలోని కొలంబో వాతావరణ నివేదిక ప్రకారం.. ఒకవేళ వర్షం కారణం సెప్టెంబరు 17న జరిగే మ్యాచ్ కు ఆటంకం వాటిల్లితే ఆ తర్వాతి రోజు అనగా సెప్టెంబరు 18న రిజర్వ్ డేని ఆసియా క్రికెట్ కౌన్సిల్ ప్రకటించింది.

భారత్ జట్టు: రోహిత్ శర్మ కెప్టెన్, శుభమన్ గిల్, విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్ కీపర్ కీపర్, ఇషాన్ కిషన్, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, జస్‌ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్.

శ్రీలంక జట్టు: పాతుమ్ నిస్సాంక, దిముత్ కరుణరత్నే, కుసల్ మెండిస్ వికెట్ కీపర్, సదీర సమర విక్రమ, చరిత్ అసలంక, ధనంజయ డి సిల్వా, దసున్ షనక కెప్టెన్,దునిత్ వెల్లలాగే, మహేశ్ తీక్షణ, కసున్ రజిత, మతీషా పతిరనా… ఆటను కొనసాగించే టీం సభ్యులు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *