హైదరాబాద్: ఎంసెట్ బైపీసీ విద్యార్థులు బీ ఫార్మసీ, ఫార్మా డి తదితర కోర్సుల్లో చేరేందుకు చివరి విడత కౌన్సెలింగ్ ఆదివారం ప్రారంభమైంది. తొలి విడత కౌన్సెలింగ్ కన్వీనర్ కోటాలో రెండు కోర్సుల్లో కలిపి 9,362 సీట్లు అందుబాటులో ఉండగా.. వాటిలో 9,168 భర్తీ అయ్యాయి. 194 సీట్లు మిగిలిపోయాయి. అయితే సీట్లు పొందిన వారు రిపోర్టింగ్ చేయకపోవడంతోపాటు కాకతీయ వర్సిటీ, జేఎన్‌టీయూహెచ్ మరికొన్ని కళాశాలల్లో సీట్లకు అనుమతి ఇచ్చింది. ఫలితంగా చివరి విడతకు బీ ఫార్మసీలో 3,523, ఫార్మా డి కోర్సులో 525 సీట్లు అందుబాటులో ఉన్నాయి. చివరి విడత కౌన్సెలింగ్‌లో భాగంగా ఈ నెల 19న ధ్రువపత్రాలు పరిశీలిస్తారు. ఈ నెల 20వ తేదీ వరకు వెబ్‌ఆప్షన్లు నమోదు చేసుకోవచ్చు. ఈ నెల 23 లోపు సీట్లు కేటాయిస్తారు.