Telangana: కర్ణాటక ఎన్నికల ముందు ఆ రాష్ట్రానికి 5 హామీలు ప్రకటించి గెలుపొందిన కాంగ్రెస్ (Congress) పార్టీ తెలంగాణకు ఇప్పుడు 6 హామీలు ప్రకటించింది.
6 హామీలు ఇవే..
1. మహాలక్ష్మి పథకం
2. రైతు భరోసా పథకం
3. గృహ జ్యోతి పథకం
4. ఇందిరమ్మ ఇంటి పథకం
5. యువ వికాసం పథకం
6. చేయూత పెన్షన్ పథకం
అధికారంలోకి రాగానే పై ఆరు పథకాలను అమలు చేస్తారు. గృహలక్ష్మి పథకం కింద తెలంగాణలోని మహిళలకు నెలకు రూ.2,500 చొప్పున ఇస్తారు. అలాగే, ఆర్టీసీలో మహిళలు ఉచితంగా ప్రయాణించవచ్చు.
గృహ జ్యోతి పథకం కింద ప్రతి ఇంటికి నెలకు 200 యూనిట్ల విద్యుత్తును ఉచితంగా అందిస్తారు. రాష్ట్రంలోని పేద మహిళలకు రూ.500కే గ్యాస్ సిలిండర్ ఇస్తారు. రైతు భరోసా కింద ఎకరాకు ఏడాదికి రూ.15,000 ఇస్తారు. కౌలు రైతుకి కూడా అంతే ఇస్తారు. రైతు కూలీలకు ఏడాది రూ.12,000 అందుతాయి.
యువ వికాస పథకం కింద విద్యార్థులకు రూ.5 లక్షలతో విద్యా భరోసా కార్డులు అందిస్తారు. ఇందిరమ్మ ఇంటి పథకం కింద గృహ నిర్మాణానికి రూ.5 లక్షల చొప్పున ఇస్తారు..