తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడమే తన స్వప్నమని, అన్ని వర్గాల అభివృద్ధి, సమన్యాయమే తన ఆకాంక్ష అన్నారు.కాంగ్రెస్ ముఖ్యనేత సోనియాగాంధీ. నిన్న హైదరాబాద్‌లోని తుక్కుగూడలో జరిగిన బహిరంగ సభలో ఆరు పథకాలతో ఉన్న గ్యారెంటీ కార్డుని ప్రకటించారు..
హైదరాబాద్‌లోని తుక్కుగూడ వేదికగా ఆదివారం సాయంత్రం కాంగ్రెస్ భారీ బహిరంగ సభ నిర్వహించింది. ఈ సభకు కాంగ్రెస్ ముఖ్య నేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీతో పాటు పలువురు ప్రముఖులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రసంగించిన సోనియా గాంధీ ఆరు కీలక పథకాలను ప్రకటించారు.
ఇందులో మహాలక్ష్మి పేరుతో 5వందలకే గ్యాస్ సిలిండర్ అందివ్వనున్నట్టు తెలిపారుఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం కల్పిస్తామన్నారు. కటుంబంలో మహిళలకు 2500 అందిస్తామని తెలిపారు.
రైతు భరోసా కింద 15వేల పెట్టుబడి సాయం ప్రకటించారు. గృహ అవసరాలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్ ఇస్తామని తెలిపారు. అదేవిధంగా వ్యవసాయ కూలీలకు 12వేల సాయంగా అందిస్తామన్నారు.
ఆరు గ్యారెంటీ పథకాలను ప్రకటించిన సోనియా గాంధీ. ప్రతి హామీ నెరవేర్చేందుకు తాము కట్టుబడి ఉంటామని అన్నారు.
నా స్వప్నం తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం రావాలని, అన్ని వర్గాలకు సమన్యాయం జరగాలన్నదే నా ఆకాంక్ష అన్నారు
సోనియా గాంధీ. మీరంతా సపోర్టుగా నిలుస్తారా? అని ప్రశ్నించగా సభికుల నుంచి పెత్త ఎత్తున నినాదాలు రావడంతో సోనియా తన ప్రసంగాన్ని జైహింద్, జై తెలంగాణ అంటూ ముగించారు.
కాగా, సోనియా గాంధీ హిందీ ప్రసంగానికి కాంగ్రెస్ నేత ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తెలుగు అనువాదం అందించారు……కాంగ్రెస్ ప్రభుత్వంలో మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం