ప్రకాశంజిల్లా యర్రగొండపాలెం సమీపంలోని ఎలక చెట్టు వద్ద ప్రమాదవశాత్తు ఆర్టీసీ ఇంద్ర బస్సు బోల్తా పడింది.
హైదరాబాద్ నుండి మార్కాపురం వస్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది.
ఈ ప్రమాదంలో 8మంది ప్రయాణీకులకు గాయాలు అయ్యాయని సమాచారం.
గాయపడ్డ ప్రయాణికులను హుటాహుటిన 108 లో యర్రగొండపాలెం ప్రభుత్వ హాస్పిటల్కు తరలించారు.
ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 9 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం.
పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది