మళ్లీ రెండు తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు తప్పేలా కనిపించడం లేదు. ఎందుకంటే.! బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడేందుకు అనుకూల అవకాశాలు ఉన్నాయి. మరో 24 గంటల్లోనే బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనుంది.
ఇప్పటికే ఈశాన్య బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. ఈ ఆవర్తనం పశ్చిమ మధ్య బంగాళాఖాతానికి ఆనుకొని ఉంది. ఆవర్తన ప్రభావంతో వాయువ్య బంగాళాఖాతంలో రేపటికి అల్పపీడనం ఏర్పడుతుందని ప్రకటించింది భారత వాతావరణం శాఖ.
వీటి ప్రభావంతో మూడు రోజుల పాటు కోస్తాలో రాయలసీమలో తెలంగాణలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయి. అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో కూడిన జల్లులు పడతాయని ఐఎండీ ప్రకటించింది. రాయలసీమలోనూ చెదురుమదురు వర్షాలు కురుస్తాయి.