ఈఎస్‌ఐ ఆసుపత్రిలో ఓ రోగి సోదరిపై అత్యాచారానికి పాల్పడిన యువకుడ్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. లిఫ్ట్‌లో ఆమెను బలవంతంగా తీసుకువెళ్లి అత్యాచారం చేశాడు షాబాద్ అనే యువకుడు.
మూడు రోజుల నుంచి పరారీలో ఉన్న షాబాద్‌ను ఎస్‌ఆర్ నగర్ పోలీసులు ఎట్టకేలకు అరెస్ట్ చేశారు. తన సోదరుడి చికిత్స కోసం కర్ణాకట నుంచి ఈఎస్‌ఐ ఆసుపత్రికి యువతి రాగా, అక్కడ ఈ దారుణం చోటు చేసుకుంది.
కర్ణాటకకు చెందిన 19 ఏళ్ల యువతి.. సోదరుడు జారి పడిపోవడంతో తీవ్ర గాయాలయ్యాయి. ఈ క్రమంలోనే అతన్ని నగరంలోని ఈఎస్‌ఐ ఆసుపత్రిలో చేర్పించారు. అతడికి సాయంగా ఉండేందుకు అతని సోదరి ఆసుపత్రికి రాగా, క్యాంటీన్‌లో పని చేసే షాబాద్ ఆమెపై కన్నేశాడు. ఆమెతో మాటలు కలుపుతూ పరిచయం పెంచుకున్నాడు. అయితే ఆమె లిఫ్ట్‌లో వెళుతున్నప్పుడు బలవంతంగా రెండో అంతస్తులోని చీకటి ప్రదేశానికి వెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు.