న్యూఢిల్లీ: మహిళలకు చట్టసభల్లో 33 శాతం రిజర్వేషన్ కల్పించేందుకు ఉద్దేశించిన మహిళా రిజర్వేషన్ బిల్లును (Women’s Reservation bill) కేంద్రం లోక్‌సభలో మంగళవారంనాడు ప్రవేశపెట్టడంతో దీనిపై చర్చ కూడా మొదలైంది..
‘నారీ శక్తి వందన్ అభియాన్’ పేరుతో కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ ఈ బిల్లును లోక్‌సభలో ప్రవేశపెట్టారు. దీనిపై లోక్‌సభలో బుధవారం చర్చ జరుగుతుంది. 21న రాజ్యసభలో బిల్లును ప్రవేశపెడతారు. కాగా, ఈ బిల్లును ఏఐఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ (Asaduddin Owaisi) వ్యతిరేకించారు. ముస్లిం మహిళలకు రిజర్వేషన్ కల్పించని ఈ బిల్లును తాము వ్యతిరేకిస్తున్నట్టు మీడియాకు తెలిపారు.
”ప్రాతినిధ్యం అనేది ఎవరికి కల్పించాలి? ప్రాతినిధ్యం అనేది లేనివారికే ప్రాతినిధ్యం కల్పించాలి. ముస్లిం మహిళలకు రిజర్వేషన్ కల్పించే అశం లేకపోవడమే ఈ బిల్లులో ప్రధాన లోపం. ఆ కారణంగా మేము (ఎంఐఎం) బిల్లును వ్యతిరేకిస్తున్నాం” అని ఒవైసీ తెలిపారు..