ఎమ్మెల్యే వరప్రసాద్ రావు కి ప్రత్యేకంగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి.
తిరుపతి జిల్లా గూడూరు వైసీపీ యువ నాయకుడు సన్నిబోయిన మహేంద్ర యాదవ్ ను ముఖ్యమంత్రి కి పరిచయం చేసిన ఎమ్మెల్యే వరప్రసాద్.
అన్నా ప్రసాద్ అన్నా, మహేంద్ర నాకు గుర్తుకు ఉన్నాడు, ఇది వరకు చాలా సార్లు పరిచయం చేసావు కదా, అని, ఏంటి మహేంద్ర విషయాలు అని దాదాపు 10నిముషాలు పాటు సమయం కేటాయించి మరీ మాట్లాడిన ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి.
ముఖ్యమంత్రి పలుమార్లు చెప్పినప్పటికీ, బాబూ బాబూ మహేంద్ర యాదవ్ బీసీ నాయకుడు బాబూ, ఎమ్ టెక్ చదువుకొని మిమ్మల్ని చూసి, మీ ఆశయాలు ఆలోచనలు నచ్చి రాజకీయాలలోకి వచ్చాడు బాబూ అంటూ మహేంద్ర యాదవ్ గురించి ముఖ్యమంత్రి కి చెప్పిన ఎమ్మెల్యే వరప్రసాద్ రావు.
అన్నా ప్రసాద్ అన్నా, మహేంద్ర ఎప్పుడు వచ్చినా కొంచం బెరుకుగా ఉంటాడు, మహేంద్ర నా దగ్గరికి వచ్చినప్పుడు మీ అన్న లాగా ఉండు మహేంద్ర అని, మహేంద్ర యాదవ్ కు చెప్పిన ముఖ్యమంత్రి జగన్.
నిన్నటి రోజు రాత్రి శ్రీ వెంకటేశ్వరస్వామి దర్శనం అనంతరం ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ని కలిసి పూలబొకే ఇచ్చిన ఎమ్మెల్యే. ఎమ్మెల్యే తో పాటు వెళ్లిన మహేంద్ర యాదవ్. ఎమ్మెల్యే కి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి.
అన్నా ప్రసాద్ అన్నా, మీకు ఆ కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉంటాయని, మీరు నిండునూరేళ్ళు జీవించాలని ముఖ్యమంత్రి ప్రత్యేకంగా చెప్పినట్లు సమాచారం.
మహేంద్ర యాదవ్ ను ఉద్దేశించి, మహేంద్ర నువ్వు యువకుడివి, బాగా చదువుకున్నావ్, మీలాంటి వాళ్లే రాజకీయాలలోకి రావాలని నా కోరిక అని, నీకు మంచి రాజకీయ భవిష్యత్తు లో ఉంటుందని ఆశీస్సులు ఇచ్చిన ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి.
మహేంద్ర కుటుంబ విషయాలు, వాళ్ళరాజకీయ పరిస్థితి అడిగి తెలుసుకున్న ముఖ్యమంత్రి జగన్.
ముఖ్యమంత్రి మాట్లాడుతున్నంత సేపు, ఓకే సార్, అలాగే సార్ అంటూ తల ఊపుతూ సమాధానం చెప్పిన యువ నాయకులు మహేంద్ర యాదవ్.
ముఖ్యమంత్రి, మహేంద్ర మాట్లాడు కుంటుంటే ప్రశాంతం గా పక్కన చేరి వింటున్న ఎమ్మెల్యే వరప్రసాద్ రావు.
మొత్తానికి ఎమ్మెల్యే వరప్రసాద్ దయవల్ల, ఒక యువ నాయకుడు, ముఖ్యమంత్రి కంట్లో పడ్డాడు. అలా పడాలి అంటే ఎంత కష్టమో వైసీపీ నాయకులు అందరికీ తెలుసు.
అటువంటి సందర్బంలో పలుమార్లు నన్ను ముఖ్యమంత్రి దగ్గరికి తీసుకొని వెళ్లి పరిచయం చేసిన ఎమ్మెల్యే కి, జీవితాంతం ఋణపడి ఉంటానని అభినందనలు తెలిపిన మహేంద్ర యాదవ్.