రూపాయి ఖర్చు లేకుండా బోన్ మ్యారో ట్రాన్స్ ప్లాంటేషన్ : మంత్రి హరీష్ రావు
రూపాయి ఖర్చు లేకుండా బోన్ మ్యారో ట్రాన్స్ ప్లాంటేషన్లను ఎంఎన్ జే ఆస్పత్రిలో నిర్వహిస్తున్నట్లు తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు వెల్లడించారు.
దేశంలోనే మూడో అతిపెద్ద ప్రభుత్వ క్యాన్సర్ ఆసుపత్రిలో రూపాయి ఖర్చు లేకుండా బోన్ మ్యారో ట్రాన్స్ ప్లాంటేషన్లను ఎంఎన్ జే ఆస్పత్రిలో నిర్వహిస్తున్నట్లు తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు వెల్లడించారు. ఈ ఆస్పత్రిలో నూతనంగా ఏర్పాటు చేసిన రోబోటిక్ సర్జరీ థియేటర్ ను ఆయన సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ…. 34 కోట్ల వ్యయంతో రోబోటిక్ సర్జరీ థియేటర్ ను ఏర్పాటు చేశామని చెప్పారు. దీని ద్వారా ఎంతోమంది రోగులకు మరింత మెరుగైన వైద్య సేవలు అందించవచ్చని తెలిపారు. ఇక క్యాన్సర్ తో ఆవాసన దశలో బాధపడుతున్న వారి కోసం పాలేటివ్ సేవలు అందుబాటులోకి తీసుకొచ్చినట్లు వెల్లడించారు. అవసరమైన వారికి ఇంటి వద్ద పాలేటి సేవలు అందిస్తున్నట్లు మంత్రి హరీష్ రావు తెలిపారు.
ఈ రోబోటిక్ థియేటర్ ద్వారా ఎంతోమంది రోగులకు మరింత మెరుగైన సేవలు అందించవచ్చని ఆశాభావం వ్యక్తం చేశారూ