◾ || పవిత్రమైన పుణ్య క్షేత్రంలో పేకాట ఆడుతున్న పోలీసులు || ◾

▪️రక్షణ కల్పించాల్సిన పోలీసులే ఆలయ సమీపంలో పేకాట ఆడుతున్న దృశ్యాలు.

▪️శ్రీశైలంలో ఆలయ సమీప పోలీస్ సెక్యూరిటీ రెస్ట్ రూమ్ లో పేకాట ఆడుతున్న పోలీసులు.

▪️వీఐపీ దర్శనం కోసం వచ్చే వారి కోసం ఈ సెక్యూరిటీ సిబ్బంది పనీ చేస్తారు అని ముఖ్య సమాచారం.

▪️వీఐపీ భక్తులకు ప్రోటో కాల్ సిబ్బంది గా ఉంటూ ఇలాంటి పనులు చేయడం పై భక్తులు,హిందూ సంఘాలు మండిపడ్తున్నాయి.

▪️శ్రీశైలం కొండపైకి పేకాట సామగ్రి ఎలా వచ్చింది…❓

▪️శ్రీశైలం కొండపైకి వచ్చేటప్పుడు గిద్దలూరు చెక్ పోస్ట్ మరియు తెలంగాణ చెక్ పోస్ట్ లో సిబ్బంది నిద్ర పోతున్నారా…❓

▪️ఈమధ్య కాలంలో శ్రీశైలం కొండపైకి మద్యం, మాంసం మరియు పేకాట సామగ్రి విచ్చల విడిగా కనిపిస్తున్నాయి అంటు స్వయంగా శ్రీశైలం ఆలయ సిబ్బంది సమాచారం ఇచ్చారు.

▪️చట్టాలు , అనేక నిబంధనలు ఉన్న ఏ మాత్రం పట్టించుకోను పోలీసులు.

▪️శ్రీశైల పవిత్ర క్షేత్రం ద్వాదశ జ్యోతిర్లింగాల లో ఒకటి హరహర మహదేవ శంభో శంకరా అంటూ భక్తుల గొంతులతో మారుమ్రోగుతుంటుంది అటువంటి పుణ్య క్షేత్రంలో స్వయంగా ప్రభుత్వ పోలీస్ సిబ్బందే ఇటువంటి దృశ్యచర్యలకు పాల్పడితే శ్రీశైల మల్లికార్జున క్షేత్రాని కాపాడేది ఎవరూ.

▪️రక్షణ కల్పించాల్సిన పోలీసులే ఇటువంటి తప్పుడు పనులు చేస్తుంటే ప్రశ్నించేది, శిక్షించేది ఎవరూ …❓

▪️ఈ దృశ్యాలు కచ్చితంగా ఆలయ సమీపంలో రక్షణ కల్పించాల్సిన పోలీసులు చేస్తున్న తప్పుకు సాక్ష్యాలు.

▪️ఈ దృశ్యాలు పై అధికారులు ఎటువంటి చర్యలు తీసుకుంటారో వేచి చూడాల్సిందేనా…❓

▪️తప్పు చేస్తే పట్టుకోవాల్సిన పోలీసులే ఇలా పేకాట ఆడుతున్న దృశ్యాలు మా కెమెరా కు చిక్కాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *