వాతావరణ మార్పు & ఆహార భద్రత కోసం భూసార ఆరోగ్యం ఉద్దేశించి ఈ సమావేశం నిర్వహించబడింది.
ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా గౌరవనీయులైన తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి శ్రీ సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గారు, మరియు గౌరవ అతిథులు – ఫిజీ దేశ గ్రామీణ, సముద్ర అభివృద్ధి & విపత్తు నిర్వహణ మంత్రి, గౌరవనీయులైన సకియాసి రాల్సేవు డిటోకా గారు, తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ కార్యదర్శి, ఐఏఎస్, శ్రీ ఏం. రఘునందన్ రావు గారు, మరియు డాక్టర్ పాల్ లూ, అంతర్జాతీయ «4 పర్ 1000» ఇనిషియేటివ్ యొక్క ఎగ్జిక్యూటివ్ సెక్రటరీ, స్పిరిచువల్ గైడ్ ఆఫ్ హార్ట్‌ఫుల్‌నెస్, శ్రీ రామ్ చంద్ర మిషన్ అధ్యక్షుడు మరియు పద్మభూషణ్ అవార్డు గ్రహీత రెవ. దాజీ గారు, ఫ్రాన్స్, ఫిజీ, థాయిలాండ్, జర్మనీ, యూఎస్ఏ , జపాన్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, రిపబ్లిక్ ఆఫ్ కొరియా, ఇండోనేషియా, నేపాల్, ఫిలిప్పీన్స్, పాకిస్తాన్, శ్రీలంక, బంగ్లాదేశ్, యూకే, చైనా, భారతదేశం మరియు ఐక్యరాజ్యసమితి వంటి 18 దేశాల నుండి ప్రతినిధులు కన్హా శాంతి వనంలో జరిగిన ఈ సదస్సులో పాల్గొన్నారు.
