ఆధునిక కాలంలో ప్రతీది ఓ ఫ్యాషన్‌లానే చూస్తున్నారు. వాకింగ్‌కు షూ, మార్కెట్‌కు వెళ్లాలంటే స్లిప్పర్, ఆఫీస్‌లో ఫార్మల్ షూ, ఆటలకు స్పోర్ట్స్ షూ, ఆకరికీ ఇంట్లోని పాలిష్ బండలపై నడవడానికి కూడా స్మూతైన చెప్పులు వాడుతూ పాదాలకు ఎక్కడా గరుకు తగిలకుండా రక్షణ కల్పిస్తున్నారని అనుకుంటారు. అది రక్షణ కాదు శరీరానికి వేసుకునే శిక్ష అని తెలియదు. చెప్పులు లేకుండా నడవడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మంచిదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ప్రతిరోజూ కాకపోయినా కనీసం వారానికి ఒకసారి అయినా చెప్పులేకుండా కిలోమీటర్ నడిచి చూడండి. శరీరంలో జరిగే మార్పులు గమనించండి.👇🏼