తెలంగాణలో జరిగిన అభివృద్ధి కొంతమంది గజినీలకు అర్థం కావడం లేదు: మంత్రి హరీష్ రావు

సంగారెడ్డి జిల్లా:
గోదావరి, కృష్ణా జలాలను తీసుకొచ్చి హైదరాబాద్‌లో తాగునీటి కొరతను సీఎం కేసీఆర్‌ తీర్చారని మంత్రి హరీశ్‌రావు చేశారు.

60 ఏండ్లు అధికారంలో ఉన్న కాంగ్రెస్‌, బీజేపీ ప్రభుత్వాలు ఈ పని చేయలేకపోయాయని అన్నారు. పేదలందరికీ ఉచితంగా మంచినీటిని బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అందిస్తుందని అన్నారు. సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు పరిధిలోని కొల్లూరులో గురువారం రెండో విడత డబుల్‌ బెడ్రూం ఇండ్ల పంపిణీని మంత్రి హరీశ్‌రావు ప్రారంభించారు.

లబ్ధిదారులకు డబుల్‌ బెడ్‌రూం ఇండ్ల పట్టాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడుతూ.. కాంగ్రెస్‌ ప్రభుత్వం హయాంలో ఇండ్లు కట్టడం అంటే అప్పుల్లో కూరుకుపోవడమే అన్నట్లుగా ఉండేదన్నారు. మహిళల కోసం సీఎం కేసీఆర్‌ చాలా పథకాలు తీసుకొచ్చారని గుర్తుచేశారు.

సీఎం కేసీఆర్‌ కిట్లు ఇస్తే.. ప్రతిపక్షాలు తిట్టిపోస్తున్నాయని అన్నారు. కాంగ్రెస్‌ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ధర్నాలు తప్ప ఏమీ జరగలేదని గుర్తు చేశారు. కొల్లూరు టౌన్ షిప్ లో విద్యా వైద్యం రవాణా సదుపాయం కల్పిస్తామని మంత్రి హరీష్ రావు హామీ ఇచ్చారు.

హైదరాబాద్ అభివృద్ధి గురించి రజనీకాంత్ కు అర్థమైంది, కానీ మన దగ్గర ఉన్న గజినీలకు అర్థం కావడం లేదని మంత్రి హరీష్ రావు ఎద్దేవా చేశారు….

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *