ఖలీస్థాన్ ఉగ్రవాది హత్య
ఖాలిస్థాన్ అంశంపై భారత్, కెనడా మధ్య దౌత్యపరమైన ఉద్రిక్తతలు కొనసాగుతున్న తరుణంలో మరో ఘటన చోటుచేసుకుంది. కెనడాలో మరో ఖాలిస్తానీ సానుభూతిపరుడు దారుణ హత్యకు గురైనట్లు తెలుస్తోంది. విన్నిపెగ్ లో ప్రత్యర్థి ముఠా జరిపిన దాడిలో గ్యాంగ్ స్టర్ సుఖ్ దోల్ సింగ్ అలియాస్ సుఖా దునెకే మరణించినట్లు నిఘా వర్గాల సమాచారం. అయితే…..దీనిపై కెనడా నుంచి ఇప్పటి వరకు అధికారిక ప్రకటన వెలువడలేదు