– దేవినేని ఉమామహేశ్వరరావు
తమ అధినేతపై మోపిన అక్రమ కేసులను ఎత్తివేయాలని, జైలు నుంచీ విడుదల చేయాలన్న డిమాండ్లతో తెలుగుదేశం పార్టీ శ్రేణులు చేపట్టిన నిరసన దీక్షల జోరు, హోరు ఏమాత్రం తగ్గడం లేదు. ఎన్టీఆర్ జిల్లా మైలవరం నియోజకవర్గం విజయవాడ రూరల్ మండలం గొల్లపూడి టీడీపీ కార్యాలయం వద్ద శిబిరంలో టీడీపీ ముఖ్యనేతలు రిలే దీక్ష చేపట్టారు. ఎస్సీ అనుబంధ విభాగ నేతలు, జక్కంపూడి కాలనీ పోలింగ్ బూత్ ఇన్ఛార్జిలు దీక్షలో కూర్చున్నారు. దీక్షలో కూర్చున్న నేతలకు టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు సంఘీభావం తెలియజేసారు. బాబు గారికి తోడుగా ఒక నియంతపై పోరాటం కోసం మైము సైతం అంటూ సిగ్నేచర్ బోర్డుపై సంతకాలు సేకరించారు.
ఈ సందర్భంగా దేవినేని ఉమా మాట్లాడుతూ…
అధికారం అడ్డంపెట్టుకొని జగన్ రెడ్డి రాష్ట్ర సంపద ఈ నాలుగున్నరేళ్ళలో రెండున్నర లక్షల కోట్లు దోపిడీ చేసాడు
గతంలో 32 సీబీఐ, ఈడీ కేసుల్లో 52 నెలలుగా కోర్టు వాయిదాలకు హాజరు కావడం లేదు
వ్యస్థలను, రాజ్యాంగాన్ని అపహాస్తం చేస్తున్నాడు
శాసనసభలో ఇరిగేషన్ మంత్రి పోలవరం గురించి మాట్లాడటం లేదు.. జరగరానివి జరుగుతాయని అంబటి రాంబాబు మాట్లాడుతున్నాడు
పోలవరాన్ని ఎలా భ్రష్టుపట్టించారో అసెంబ్లీలో చెప్పండి ?
మీరు సినిమాలు ఏమీ చూపించనవసరం లేదు.. బయట 70ఎంఎం సినిమాలు ఉన్నాయి
పోస్టింగ్ల కోసం ఎవరైతే అధికారులు కక్కుర్తి పడ్డారో వాళ్ళ వల్లే అనర్థాలు జరుగుతున్నయి
‘‘ముఖ్యమంత్రి జగన్ రాజకీయ కక్షతో, చంద్రబాబును అప్రతిష్ఠ పాలుచేయడానికి ఈ బూటకపు కేసు ఆయన మీద రుద్దారు
ప్రపంచ వ్యాప్తంగా ప్రతి తెలుగువారు చంద్రబాబు నాయుడు గారి అక్రమ అరెస్ట్ పై స్పందిస్తున్నారు
ఎప్పుడు ఎన్నికలు వచ్చినా ప్రజలు వైసీపీని బంగాళాఖాతంలో కలిపేందుకు సిద్ధంగా ఉన్నారు