మదాపూర్‌లోని రహేజా మైండ్‌స్పేస్‌లో రెండు భారీ భవనాలను అధికారులు కూల్చివేశారు.
అత్యాధునిక సాంకేతిక టెక్నాలజీ సహాయంతో రహేజా మైండ్‌స్పేస్‌లోని నెంబర్ 7, 8 భవనాలను క్షణాల్లోనే అధికారులు నేలమట్టం చేశారు. ఏడు అంతస్తుల్లో ఉన్న భవనాలు క్షణాల్లోనే కూల్చివేశారు. ఎడిపిక్ ఇంజినీరింగ్ సంస్థ భవనాల కూల్చివేతను చేపట్టింది.
అయితే, రెండు భవనాల స్థానంలో కొత్తగా భవనాలు నిర్మించనున్నారు. కొద్దికాలం కిందట భవనాలను నిర్మించారు. పలు సాంకేతిక కారణాలతో భవనాలకు సమస్యలు రావడంతో వాటిని కూల్చివేయాలని నిర్ణయించారు.
ఈ క్రమంలోనే అత్యాధునిక సాంకేతిక టెక్నాలజీ సహాయంతో భారీ ఎత్తున పేలుడు పదార్థాలను వినియోగించి.. పక్కనే ఉన్న భవనాలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా జాగ్రత్తలు తీసుకుంటూ భవనాలను కూల్చివేశారు…..