హైదరాబాద్:
దేశంలోనే అత్యధిక సీసీ కెమెరాలతో పటిష్టమైన భద్రత వ్యవస్థను కలిగిన రెండో నగరంగా హైదరాబాద్ రికార్డు సాధించింది.
విశ్వవ్యాప్తంగా తొలి 50 నగరాల జాబితాలో 41వ స్థానంలో నిలిచింది. అత్యుత్తమ సర్వేలైన్స్ వ్యవస్థను కలిగిన తొలి 20 జాబితాలో చైనాలోని పలు నగరాలు నిలవగా.. ఉత్తమ 50 నగరాల్లో భారత్ నుంచి ఢిల్లీ 22వ స్థానంతోపాటు హైదరాబాద్ 41వ స్థానంలో ఉన్నాయి.
అంతర్జాతీయ స్థాయిలో మెరుగైన పర్యవేక్షణ వ్యవస్థను కలిగిన నగరాల జాబితాను రూపొందించిన ప్రముఖ అధ్యయన సంస్థ వరల్డ్ ఆఫ్ స్టాటిస్టిక్స్ సంస్థ…
తాజా జాబితాను ఎక్స్ ట్విట్టర్,లో విడుదల చేసింది. జనాభా, సీసీ కెమెరాలు, నగర విస్తీర్ణం వంటి అంశాలను పరి గణనలోకి తీసుకుని రూపొందించిన ఈ జాబితాలో హైదరాబాద్‌కు ఉత్తమ స్థానం దక్కింది…