కరీంనగర్ జిల్లా:
ఆర్టీసీ బస్సు, లారీ ఢీకొని నలుగురికి తీవ్ర గాయలైన ఘటన శంకరపట్నం మండల పరిధిలోని తాడికల్ శివారులోని ఆదివారం ఉదయం చోటుచేసుకుంది.
ప్రత్యక్ష సాక్షుల కథనం మేరకు వరంగల్ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు 46 మంది ప్రయాణికులతో నిజామాబాద్ కు వెళ్తుంది. ఈ క్రమంలో బస్సు తాడికల్ శివారులోకి రాగానే కరీంనగర్ వైపు నుంచి ఎదురుగా వస్తున్న లారీని ఢీకొట్టింది.
ఈ ప్రమాదంలో నలుగురికి తీవ్ర గాయాలు కాగా, మరో 16 మంది ప్రయాణికులకు స్వల్ప గాయాలయ్యాయి. వారందరినీ 108 వాహనంలో చికిత్స నిమిత్తం కరీంనగర్ ప్రభుత్వాసుపత్రికి తరలిలంచారు.
విషయం తెలుసుకున్న కేశవపట్నం ఎస్.ఐ పాకాల లక్ష్మారెడ్డి ఘటనా స్థలానికి చేరుకు వివరాలను సేకరిస్తున్నారు….