విజయవాడ: వేతనాల పెంపు సహా మినీ అంగన్వాడీ వ్యవస్థ రద్దు, అధికారులు వేధింపులు తగ్గించాలి తదితర డిమాండ్లతో ‘చలో విజయవాడ’కు అంగన్వాడీలు పిలుపునిచ్చారు..
‘చలో విజయవాడ’కు అనుమతి లేదంటూ రాష్ట్రవ్యాప్తంగా వివిధ జిల్లాల్లో అంగన్వాడీలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దీంతో మారువేషాల్లో అంగన్వాడీలు విజయవాడకు చేరుకుంటున్నారు. కొంతమందిని విజయవాడ రైల్వే స్టేషన్, బస్టాండ్ వద్ద అరెస్టు చేసిన పోలీసులు ప్రైవేటు కల్యాణ మండపాలకు తరలించారు. అయితే, ఎట్టిపరిస్థితుల్లోనూ ‘చలో విజయవాడ’ను విజయవంతం చేస్తామని అంగన్వాడీలు స్పష్టం చేశారు. తమ సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లాలని కార్యక్రమం చేపడితే పోలీసులు అడ్డుకోవడం దుర్మార్గమన్నారు. అంగన్వాడీల అరెస్టులను వామపక్షాలు ఖండించాయి..