హైదరాబాద్:
రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలో గణేష్ నిమజ్జనం కోసం భారీ బందోబస్తు ఏర్పాటు చేశామని పోలీస్ కమిషనర్ డిఎస్ చౌహాన్ అన్నారు. కమిషనరేట్ పరిధిలో పనిచేస్తున్న డిసిపిలు, ఎసిపిలు, ఇన్స్‌స్పెక్టర్లు, అధికారులతో నాచారంలోని ఐఐసిటిలో సోమవారం సాయంత్రం సమన్వయ సమావేశం ఏర్పాటు చేశారు.
ఈ సందర్భంగా రాచకొండ పోలీస్ కమిషనర్ డిఎస్ చౌహాన్ మాట్లాడుతూ.. గణేష్ నిమజ్జనం ప్రణాళిక ప్రకారం జరగాలని, ఎక్కడ ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా చూడాలని అధికారులను ఆదేశించారు.
గణేష్ విగ్రహాల నిమజ్జనం విషయంలో నిర్వాహకులతో, ఇన్‌స్పెక్టర్లు సమన్వయం చేసుకోవాలని అన్నారు. గణేష్ నిమజ్జనం సమయంలో ఎక్కడా శాంతిభద్రతల సమస్య రాకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. శాంతిభద్రతల విషయంలో అందరు అధికారులు సమిష్టిగా పనిచేయాలని కోరారు.