దళిత మహిళ ను వివస్త్రను చేసి నోట్లో మూత్ర విసర్జన చేసిన వడ్డీ వ్యాపారి

పాట్నా:
తీసుకున్న అప్పు చెల్లించి వేసినప్పటికీ మరింత డబ్బు కట్టాల్సిందేనంటూ వేధిస్తున్న వడ్డీ వ్యాపారిపై పోలీసులకు ఫిర్యాదు చేసినందుకు కక్ష పెంచుకున్నాడు ఓ వడ్డీ వ్యాపారి.

దళిత మహిళపై కక్ష పెంచుకున్న వడ్డీ వ్యాపారి తన అను చరులతో కలసి దళిత మహిళను వివస్త్రను చేయడంతోపాటు ఆమె పై దాడి చేసి ఆమె నోట్లో మూత్ర విసర్జన చేసిన అత్యంత దారుణ ఘటన బీహార్ లో శనివారం రాత్రి జరిగినట్లు ఆలస్యంగా తెలిసింది.

ఈ ఘటనలో ప్రధాన నిందితుడైన ప్రమోద్ సింగ్, అతని కుమారుడు అంషు సింగ్ పరారీలో ఉండగా వారిని అరెస్టు చేసేందుకు పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.

తీసుకున్న అప్పును వడ్డీతోసహా చెల్లించి వేసినప్పటికీ తనపై దాడి, వేధింపులు జరిగాయని బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

కొద్ది నెలల క్రితం ప్రమోద్ సింగ్ నుంచి తన భర్త రూ. 1,500 అప్పు తీసుకున్నాడని, తిరిగి వడ్డీతో కలిపి చెల్లించివేశాడని ఆమె తెలిపారు.

అయితే ఇంకా డబ్బు చెల్లించాలంటూ ప్రమోద్ సింగ్ డిమాండ్ చేశాడని, అందుకు తాము నిరాకరించామని ఆమె చెప్పారు. పాట్నాలోని ఖుస్రూపూర్ పోలీసు స్టేషన్ పరిధిలోని గ్రామంలో శనివారం రాత్రి ఈ ఘటన జరిగినట్లు పోలీసులు తెలిపారు.

మరింత డబ్బు ఇవ్వకపోతే వివస్త్రను చేసి గ్రామంలో నగ్నంగా ఊరేగిస్తానని ప్రమోద్ సింగ్ తనను ఫోన్లో బెదిరించినట్లు ఆమె పోలీసులకు ఫిర్యాదు చేశారు…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *