అన్నదాతలకు అండగా సీఎం కేసీఆర్….

రైతు సంక్షేమమే బిఆర్ఎస్ ప్రభుత్వ లక్ష్యం….

రైతులకు పంట నష్ట పరిహారం చెక్కులను పంపిణి చేసిన మంత్రి వర్యులు ఎర్రబెల్లి దయాకర్ రావు గారు ఎమ్మెల్యే అరూరి రమేష్ గారు……

తెలంగాణ రాష్ట్రంలో రైతు సంక్షేమమే లక్ష్యంగా బిఆర్ఎస్ ప్రభుత్వం, సీఎం కేసీఆర్ గారు కృషి చేస్తున్నారని బిఆర్ఎస్ పార్టీ వరంగల్ జిల్లా అధ్యక్షులు, వర్దన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేష్ గారు అన్నారు.

పర్వతగిరి మండలం లోని పలు గ్రామాలకు చెందిన 2810 మంది రైతులకు పంట నష్ట పరిహారం (ఇన్ పుట్ సబ్సిడీ) కింద మంజూరు అయిన 2 కోట్ల 7 లక్షల 40 వేల రూపాయల విలువగల చెక్కులను కల్లెడ లోని క్యాంప్ కార్యాలయంలో మంత్రి వర్యులు ఎర్రబెల్లి దయాకర్ రావు గారితో ఎమ్మెల్యే అరూరి రమేష్ గారు రైతులకు అందజేశారు.

ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ దేశంలో ఏ రాష్ట్రంలో లేని అనేక రైతు సంక్షేమ కార్యక్రమాలు చేపడుతున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ మాత్రమేనని తెలిపారు. అకాల వర్షాలకు పంట నష్టపోయిన రైతులకు భరోసా కల్పించాలని ఎకరాకు 10వేల రూపాయల నష్ట పరిహారాన్ని అందిస్తున్న గొప్ప నాయకుడు ముఖ్యమంత్రి కేసీఆర్ గారని కొనియాడారు. రైతు బందు, రైతు భీమా, ఉచిత విద్యుత్, సాగు నీరు అందిస్తూ తెలంగాణ దేశానికే ఆదర్శంగా నిలుస్తుందని తెలిపారు.

అనoతరం పర్వతగిరి మండలం లోని పలు గ్రామాలకు చెందిన 11 మందికి ముఖ్య మంత్రి సహయ నిది ద్వారా మంజూరు అయిన 4 లక్షల 65 వేల రూపాయల చెక్కులను లబ్ధిదారులకు ఎమ్మెల్యే గారు అందజేశారు…

ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజా ప్రతినిధులకు నాయకులకు కార్యకర్తలకు రైతులు పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *