Hyderabad: నిజాంపేటలో కుప్పకూలిన రెండంతస్తులు.. ఉలిక్కిపడిన స్థానికులు

హైదరాబాద్‌: నిర్మాణంలో ఉన్న ఓ భవనంలో రెండు అంతస్తులు ఒక్కసారిగా కుప్ప కూలాయి. నిజాంపేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని ఎన్‌ఆర్‌ఐ కాలనీలో ఈ ఘటన జరిగింది..

ఈ ప్రమాదంలో ఇద్దరు కార్మికులు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. నిర్మాణంలో సరైన నాణ్యత ప్రమాణాలు పాటించకపోవడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ తెలిపింది. ఒకటో స్లాబ్ క్యూరింగ్ సరిగా చేయకపోవడం, వెంటనే రెండో స్లాబ్ వేయడం, రెండో స్లాబ్ కూడా బరువు తాళలేక కుప్పకూలిందని పేర్కొన్నారు. బుధవారం సాయంత్రం ఐదు గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగినట్లు అధికారులు తెలిపారు..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *